12జనవరి 2018 శుక్రవారం మీ రాశి ఫలాలు

today 12th january 2018 horoscope
Highlights

  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం :ఒక సంఘటన మీ మనసు చెదిరిపోయేలా చే స్తుంది. ఆర్థిక నష్టం కానీ జరిగే అవకాశముంది. ఆవేశానికిలోను కాకుం డా మీ పనులు చేసుకోవటం మంచిది. మాట విషయంలో జా గ్రత్త అవసరం. పెట్టుబడులకు అంతగా అనువైన రోజు కాదు. ఉద్యోగం, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

వృషభం

 

వృషభం :ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తిని కానీ మీ ప్రేమను వ్యక్తపరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూలదినం.

మిథునం

 

మిథునం :ఆర్థికంగా బాగుటుంది. రావలసిన బకాయి లు వసూలవుతాయి. వివాదాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజ యం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే స్నేహితుల నుం చి అనుకోని సాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుము ఖం పడతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యా, భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం.

కర్కాటకం

 

కర్కాటకం : మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవటానికి అనుకూల దినం. మిత్రుల నుంచి అనుకున్న సాయం అందుతుంది. పిల్లలకు ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి. సం తానం కోసం ఎదురుచూస్తున్నవారికి ఫలితం దక్కుతుంది.

సింహం

 

సింహం :పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబసభ్యులతో గడపాలి అనే ఆలోచన అధికం గా ఉంటుంది. విద్యా, భూ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కన్య

 

కన్య :వ్యాపార, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలం. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పు కానీ, బదిలీ కానీ ఉంటుంది.

తుల

 

తుల :ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న వి ధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇంటికి ఏదైనా వస్తువు కొనటం కాని, బాగుచేయించటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు కాబట్టి తొందరపాటు మంచిది కాదు.

వృశ్చికం

 

వృశ్చికం: మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహా రం తీసుకోవటం కానీ, నూతన దుస్తులు కొనుగోలు చేయ టం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉం డటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహా యం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

ధనుస్సు

 

ధనుస్సు: కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది.

మకరం

 

మకరం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం

 

కుంభం :చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు.

మీనం

మీనం :రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు.

loader