మేష రాశి:  చేపట్టిన కార్యక్రమాలు పట్టుదలగా పూర్తి చేస్తారు. భార్యతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ విషయాలు అభివృద్ధి కోసం ఆలోచిస్తారు. తండ్రి గారి సహాయ సహకారాలు తీసుకోవాల్సి ఉంటుంది. భార్య సహకారంతో వృత్తి వ్యాపారాలు బాగా నడుస్తాయి.

వృషభ రాశి  ; సోదరుల సహకారం ఉంటుంది. అనుకున్న పనులు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి కూడా ఉంటుంది. కొత్త అవకాశాలు చేజారే అవకాశం కూడా ఉంది. శ్రీ వేంకటేశ్వర దర్శనం చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది.

మిథున రాశి  ; చేయు పనులు బాధ్యతగా చేయవలసి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కలవు. పిల్లలతో కలిసి షికారులు చేస్తారు. భార్యతో బాధ్యతగా మెలగవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటక రాశి ; చేయు పనులు, తలపెట్టిన కార్యక్రమాలు శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని అనవసర ఖర్చులు కూడా ఉన్నాయి. కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేస్తారు.

సింహ రాశి  ; సోదరుల సహకారం ఉంటుంది. దైవ దర్శనం కూడా చేసుకుంటారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. పిల్లల కొరకు ఆలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి ఉంటుంది.

కన్యా రాశి  ; ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ అవసరాలు తీరుస్తారు. సహచరుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభాన్ని తెస్తాయి.

తులా రాశి  ; మంచి విందు భోజనం లభిస్తుంది. ధన ప్రణాళికలు లాభాన్ని తెస్తాయి. చిన్న చిన్న సమస్యలు కూడా కలవు. భార్య సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి.

వృశ్చిక రాశి  ; అవసరానికి ధనం చేకూరుతుంది. దూరపు బంధువుల మాటలు వింటారు. ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించవలసి ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ధనాన్ని తెస్తాయి.

ధనూ రాశి  ; ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించవలసి ఉంటుంది. విందు భోజనం చేస్తారు. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. వారితో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి.

మకర రాశి  ; చేయు పనులందు ఆటంకాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు కూడా ఏర్పడతాయి. వ్యాపార అభివృద్ధికై ఆలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాన్ని తెస్తాయి.

కుంభ రాశి  ; సహచరుల సహకారం పూర్తిగా ఉంటుంది. తండ్రి గారి సహకారం పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. బంధు మిత్రుల పరిచయాలు బాగా ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేసి లాభాన్ని తెచ్చుకుంటారు.

మీన రాశి  ; ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చేయు పనులందు ఆటంకాలు ఏర్పడతాయి. దైవ దర్శన ప్రాప్తి వలన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి వుంటుంది. పిల్లల విషయంలో కూడా ఆలోచించవలసి ఉంటుంది.