Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో అమానుషం, 98 రోజుల కోమా, తర్వాత మృత్యువు

ఒక చిన్న పొరపాటు చేసినందుకు తిరుమల శ్రీవారి సన్నిధిలో సెక్యూరిటీ సిబ్బంది  దెబ్బలతో అరవైఅయిదేళ్ల పద్మనాభం కుప్పకూలిపోయాడు. కోమాలోకి జారుకున్నాడు. 98 రోజుల తర్వాత నిన్న స్విమ్స్ అసుపత్రిలో  తుది శ్వాస విడిచాడు. శ్రీవారిని దర్శించకునేందుకు తిరుమల వచ్చి, భక్తి భావంతో ఇంటిదారి పట్టాల్సిన కుటుంబం సర్వాన్ని కోల్పోయి ఇపుడు తిరిగెళ్లిపోయింది, దీనంగా వెక్కి వెక్కి ఏడుస్తూ.

tirumala devotee finally died after 98 day coma

సెక్యూరిటీ వ్యవస్థలో అమానుషం దాక్కుని ఉంటుంది. గుడి కావచ్చు, నడిరోడ్డు కావచ్చు, రైతు ఉద్యమం కావచ్చు, విద్యార్థు నిరసన కావచ్చు, వకాశం వచ్చినపుడల్లా బుసకొట్టి మనిషిని కాటేసే ప్రయత్నం చేస్తుంది.  సరిగ్గా 98 రోజుల కిందట తిరుమలలో సెక్యూరిటీ అమానుషాత్వానికి బలయిన  భక్తుడొకరు ఈ కాలమంతా మృత్యువుతో పోరాడి, చివరకు తనువుచాలించాడు.  98 రోజులుగా కోమాలో ఉండి,  స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా వాసి పద్మనాభం ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రాణం విడిచారు.

ఆయన చేసిన  తప్పంతా, పొరపాటునమగవారి క్యూ లో నుంచి మహిళల క్యూలోకి మారడమే.

అంతే, అది ఒక పవిత్ర స్థలమని మర్చిపోయి, సెక్యూరిటీ వాళ్లు ర్ర శ్రీవారి ఆలయ క్యూలైన్‌లో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతిలో గాయపడిన ఆయన చివరకు ప్రాణాలొదిలారు.

మార్చి 20వ తేదీన ఏలూరుకు చెందిన కోటా పద్మనాభం(65) కుటుంబ సభ్యులతో మనవరాలి అన్నప్రాసన కోసం కలిసి తిరుమల వచ్చారు.

అదేరోజు రాత్రి 9.30 గంటలకు సర్వదర్శనం కోసం వచ్చారు.  క్యూలో నిలబడే ఆలయం వద్దనున్న స్కానింగ్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ తనిఖీల సమయంలో అరవైఅయిదేళ్ల  పద్మనాభం పొరపాటున స్త్రీల వరసలోకి వెళ్లాడు.

వెంటనే ఆయనను విధుల్లో ఉన్న ఇద్దరు మహిళాసెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీనితో పద్మనాభానికి వారికి వాగ్వాదం జరిగింది.

మహిళా సెక్యూరిటీ సిబ్బందికి మరొక ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ తోడయ్యాడు. తామున్నది శ్రీవారి సన్నిధి,హింసకు తావు లేని స్థలం అనే స్పృహ కూడా లేకుండా  అంతాకలసి ముసలాయన మీద దాడి చేశారు. ఆ దెబ్బలకు పద్మనాభం కుప్పకూలి పోయాడని  కుటుంబ సభ్యులు దుంఖిస్తూ చెప్పారు.

కిందపడిపోయిన పద్మనాభాన్ని తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. అయితే, ఆలాఠీ దెబ్బలికి ఆయన అప్పటికే కోమాలోకి జారుకున్నారు.

అప్పట్నుంచి నిన్న సాయంకాలం దాకా ఆయన  కోమాలోనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం అయిదున్నర గంటలకు  మృతిచెందారు.

 తండ్రి బతుకుతాడన్న ఆశతో ఆయన కుమారుడు రామచంద్రయ్య 98 రోజులుగా ఇంటి కి వెళ్లకుండా అసుప్రతినే అంటిపెట్టుకున్నారు. ఎంత స్విమ్స్ అయినా, పేద వారికి ఎలాంటి వైద్యం దొరుకుతుందో చెప్పాల్సిన పనిలేదు. శ్రీవారిని దర్శించకునేందుకు తిరుమల వచ్చిన భక్తి భావంతో వెళ్లాల్సిన కుటుంబం సర్వాన్ని కోల్పోయి ఇపుడు తిరిగెళ్లిపోయింది.ఆసుప్రతిలో సరైన వైద్యం కూడా దొరకలేదనికుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ సంఘటన జరిగాక 15 రోజులకు ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను తొలగించారు. ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios