తార్నాకకు చెందిన నర్సింగ్‌రావు, పద్మ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం డబ్బులు డ్రా చేసేందుకు బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని యాక్సిస్ బ్యాంకుకు బైక్‌పై వచ్చారు. రూ.2.10 లక్షలు డ్రా చేసి పద్మ చేతి బ్యాగులో పెట్టుకున్నది. బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి నల్ల పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు పద్మ చేతిలోని బ్యాగును లాగేందుకు యత్నించారు. ఆమె ప్రతిఘటించగా గట్టిగా లాగటంతో ఆమె కిందపడిపోయింది. అయినా కనికరించని ఆ దుండగులు బ్యాగును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. వెంటనే తేరుకున్న బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుల కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.