అపోలో లో చికిత్స పొందుతూ చో రామస్వామి కన్నుమూత దివంగత జయలలితతో ఆయనకు ప్రత్యేక అనుబంధం
‘తుగ్గక్’ పత్రికతో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ఎడిటర్ చో రామస్వామి ఇక లేరు. మీడియాకు చాలా దూరంగా ఉండే జయలలితకు చో అత్యంత ఆప్తుడు. ఇద్దరు సినీరంగం నుంచే రావడం విశేషం. జయ మృతిచెందిన మరుసటి రోజే చో మరణించడం తమిళనాట మరింత విషాదాన్ని నింపింది.
తమిళనాడుకు చెందిన చో రామస్వామి పూర్తి పేరు శ్రీనివాస అయ్యార్ రామస్వామి.బుధవారం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత పలు సినిమాల్లో నటించారు. 'మహ్మద్ బీన్ తుగ్లక్' నాటకంతో బాగా గుర్తింపు పొందారు.దీంతో తుగ్గక పేరుతోనే పత్రికను స్థాపించి సమకాలిన రాజకీయాలపై వ్యంగ్యంగా అందులో వ్యాసాలు రాసి ప్రసిద్ధి చెందారు.
జయలలితకు సలహాదారుడిగా, రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. కాగా, నటి రమ్యకృష్ణకు ఆయన మేనమామ కూడా.
