తల్లిపాలు తాగి చిన్నారి మృతి

First Published 28, Dec 2017, 11:29 AM IST
three years old  girl died due to feed by mother milk
Highlights
  • తల్లిపాలు తాగి మృతిచెందిన  చిన్నారి

పుట్టిన ప్రతి బిడ్డ.. తల్లిపాలు తాగి తన ఆకలిని తీర్చుకుంటుంది. కానీ.. ఓ బిడ్డ మాత్రం.. కేవలం తల్లిపాలు తాగినందుకే మృత్యువాతపడింది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

అసలేం జరిగిందంటే.. మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామానికి చెందిన కడారి మల్లయ్య అనే వ్యక్తి ఈ నెల 25వ తేదీ రాత్రి మద్యం మత్తులో పురుగుమందు తాగడానికి ప్రయత్నించాడు. గమనించిన ఆయన భార్య లక్ష్మీదేవి వారించింది. ఈ ప్రయత్నంలో పురుగు మందు లక్ష్మీదేవి ఛాతీపై పడింది. దీన్ని గమనించకుండా లక్ష్మీదేవి అదే రోజు తన కూతురు ప్రణీతకు పాలు ఇచ్చింది. విషంతో కూడిన ఆ పాలు తాగిన చిన్నారి ప్రణీత అస్వస్థతకు గురైంది. వెంటనే చిన్నారిని చికిత్సకోసం హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం పాప మరణించింది. దీంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

loader