సంక్రాంతి పండగ వేళ నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగరంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఆగివున్న లారీని ఇన్నోవా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెంకు చెందిన ఆరుగురు గ్రామస్థులు ఇన్నోవా కారులో నాగపట్నానికి బయలుదేరారు. ఎన్టీఆర్‌నగర్‌ దగ్గరికి వచ్చేసరికి వీరి కారు ఆగి వున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. మంచు దట్టంగా అలుముకోవడం వల్ల దారి కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.