కంపెనీ సీఈవో కన్నా ఉద్యోగి జీతమే ఎక్కువ

కంపెనీ సీఈవో కన్నా ఉద్యోగి జీతమే ఎక్కువ

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్ సీఈవో టిమ్ కుక్.. గురించి గత రెండు రోజుల క్రితం వార్తలు వెలువడ్డాయి. ఆయన జీతం 47శాతం పెరిగి 13మిలియన్ డాలర్లకు చేరుకుంది అని. ఆయన జీతం వివరాలు విన్నవారంతా ఒక్కసారిగా నోరు వెళ్లపెట్టారు. అయితే.. అదే కంపెనీలో పనిచేస్తున్న ఏంజెలా అహ్రెంట్స్ అనే మహిళ.. సీఈవో కన్నా ఎక్కువ సంపాదిస్తోంది. దాదాపు ఏ  కంపెనీలో అయినా.. సాధారణ ఉద్యోగులకన్నా.. సీఈవోకే ఎక్కువ జీతం ఉంటుంది. కానీ.. యాపిల్ కంపెనీలో మాత్రం ఈ మహిళ సీఈవో టిమ్ కుక్ కన్నా రెట్టింపు జీతం అందుకోవడం గమనార్హం.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. యాపిల్ కంపెనీలో 2017వ సంవత్సరంలో అత్యధిక జీతం అందుకున్న మహిళ ఈమె. సీఈవో టిమ్ కుక్ జీతం 12.8మిలియన్ డాలర్లు కాగా.. ఆమె జీతం ఎంతో తెలుసా.. అక్షరాలా 24.2 మిలియన్ డాలర్లు. 2014లో ఆమె యాపిల్ కంపెనీలో చేరగా.. చేరిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఆమె టిమ్ కుక్ కన్నా ఎక్కువ జీతం అతందుకోవడం గమనార్హం. గతంలో ఆమె లక్సరీ ఫ్యాషన్ బ్రాండ్ బర్బరీకి సీఈవో, డైరెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏంజెలా.. యాపిల్ కంపెనీలో సీనీయర్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page