వరి అన్నం తప్ప ఏదీ తిన్నా.. చావే శరణ్యం

First Published 6, Apr 2018, 3:29 PM IST
This woman can die if she eats anything other than rice and veggies
Highlights
ఇదో వింత జబ్బు

మనిషి బ్రతకడం కోసం ఆహారం తీసుకుంటాడు.  ఆ మాటకి వస్తే ఒక్క మనిషి మాత్రమే కాదు.. ఈ భూమి మీద ప్రాణం ఉన్న ప్రతి జీవి బ్రతకాలంటే ఆహారం తీసుకోవాల్సిందే. అందరూ బ్రతకడానికి ఆహారం తీసుకుంటూ ఉంటారు ఇది సర్వసాధారణం. కానీ ఒక అమ్మాయి మాత్రం కేవలం బతకడం కోసం ఏమీ తినడం లేదు. 
కొంచెం విచిత్రంగా ఉంది కదూ. విచిత్రంగా ఉన్నా ఇది నిజం. సోఫీ విల్స్ అనే పాతికేళ్ల అమ్మాయి అన్నం, కూరగాయలు తప్ప మరేది తినకూడదు. ఒక వేళ తింటే.. నెక్ట్స్ మినిట్ ప్రాణాలతో ఉండదు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సోఫీ.. మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతోంది. దీని లక్షణాలేంటో తెలుసు. ఏ ఫుడ్ తిన్నా ఎలర్జీ రావడం. కేవలం అన్నం, కూరగాయలు మాత్రమే తినగలదు. వేరే ఏది తిన్నా కష్టమే. చాలామంది ఫుడ్ ఎలర్జీలు ఉంటాయి. కాకపోతే.. ఒకటో, రెండో ఫుడ్స్ పడవు. అదేవి విచిత్రమో.. ఈ అమ్మాయికి ఏ ఫుడ్డూ పడదు. ఇలాంటి జబ్బు లక్షన్నర మందిలో ఒక్కరికి వస్తూ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈమెకు ఫుడ్ మాత్రమే కాదు.. సూర్య రశ్మి, ఉరుములు కూడా పడవు

దీని బారిన పడకుండా ఉండేందుకు రోజుకి దాదాపు 60 ట్యాబ్లెట్లు మింగాల్సి వస్తోందని సోఫీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను అన్నం, కూరగాయలు తప్ప ఏమీ తినకూడదని బాధపడింది. తనకు ఈ రకమైన జబ్బు సోకిందని గుర్తించకముందు.. రోజుకి కనీసం ఏడుసార్లు ఎలర్జీ వచ్చేదని తెలిపింది. గతంలో చక్కగా ఫ్రెండ్స్ తో డిన్నర్ , మారథాన్ లకి వెళ్లేదానినని.. ఇప్పుడు వెళ్లలేక పోతున్నట్లు చెప్పింది. ఈ జబ్బుకి పరిష్కార మార్గం  కోసం రెండేళ్లలో 30కి పైగా హాస్పటల్స్ తిరిగింది. అయినా లాభం లేకపోయింది. పెద్ద పెద్ద శబ్ధాలు విని కూడా తట్టుకోలేదు. 2014 నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరిగితే.. 2016లో తనకు ఈ జబ్బు ఉన్నట్లు వైద్యులు కనుక్కోకలిగారని ఆమె తెలిపింది.

loader