Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) ఈ లేడీ పోలీసామె దగ్గిర ‘రూలింగ్ పార్టీ’ అంటే కుదర్దు

రూలింగ్ పార్టీవోళ్ల పప్పులు మన దగ్గిరేం ఉడకవు అంటోంది ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ లేడీ పోలీసాఫీసరు. తప్పు చేస్తే రూలింగ్ పార్టీ వోళ్లను కూడా బొక్కలో తోసేస్తా నంది. అది తన డ్యూటీ అంటున్నది. డ్యూటీ చేయొద్దా... సిఎం దగ్గిర నుంచి లెటర్ తీసుకురండి...అనేది రూలింగ్ పార్టీ వోళ్లకు ఆమె సలహా...

this up lady police officer is not scared of Ruling party men

 

 

 

రూలింగ్ పార్టీ  అనేది చాలా నేరాలు చేసేందుకు, చేసిన నేరాలనుంచి తప్పించుకునేందుకు లైసెన్స్. చాలా మంది పోలీసోళ్లు, లోకల్ అధికారులు రూలింగ్  పార్టీ నాయకుల గలీజు పనులను చూసీచూడనట్లు పోతారు. వీడితో ఎందుకులే గొడవ అనుకుంటారు.


ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో బులంద్‌షహర్‌ పోలీస్‌ సర్కిల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న శ్రేష్ఠా ఠాకూర్‌ విషయంలో ఈ పప్పులుడకవు. రూలింగ్  పార్టీ అన్చెప్పి తప్పించుకోవాలనుకుంటే కుదరదు ఆమె దగ్గిర.  తను చేయాల్సింది చేసేస్తుంది. పోయిన వారంలోమోటారుబైకుపై వెళుతున్న ఒక  వ్యక్తిని ఆపింది.  లైసెన్స్‌ ఉండదని అనుమానమొచ్చింది. లైసెన్స్ చూపించమంది. అతగాడి దగ్గర లేదు. ‘నేను రూలింగ్ పార్టీ’ అని జడిపించాలనుకున్నాడు.


కుదరదు పో బే,  ముందు ఛలాన్ కట్టు అంది, రూ.2 వేలు  చెవులు పిండి కట్టించింది.


రూలింగ్ పార్టీ వ్యక్తినని , గుర్తు పట్టరా, నన్నే నిలబెడతారా అంటూ ఆమె పక్కనే ఉన్న కానిస్టేబుల్‌ మీద అరవడం మొదలుపెట్టాడు.
వీడిని ఎక్కువ సేపు రోడ్డు మీద ఉంచరాదని  పసిగట్టి, వాడింకా నోరు మూయక ముందే అరెస్టు చేసి లాకప్పులో పడేసింది.
అంతేకాదు,ఠంచన్ గా కోర్టు ముందు హాజరుపర్చింది.


అక్కడకూడా రూలింగ్  పార్టీ వాడినంటూ నోరు పారేసుకుంటుంటే  ఇంకొక కొత్త సెక్షన్ మీద కేసు పెట్టి జైల్లో పడేలా చేసింది.
దీనితో రూలింగ్ పార్టీ వోళ్లకు కోపమొచ్చింది. జనాన్నంతాపోగేసుకుని స్టేషన్కు వచ్చి ఆమెను చుట్టుముట్టారు.


శ్రేష్ఠ ఏమాత్రం తొణకలేదు.. బెణకలేదు. హుందాగా, ధీమాగా నడుంపై చెయ్యేసి నిలబడింది. ‘మేం రాత్రి ఇంట్లో పిల్లాపాపల్ని వదిలేసి ఇక్కడికొచ్చేది పనిలేక కాదు,  డ్యూటీలు చేయడానికి. కాగితాల్లేకుండా స్కూటర్‌ తోలితే లోపలేసేదే. అంతే,’ అని నిక్కచ్చిగా చెప్పింది.


అంతేకాదు, అధికారపార్టీ వాళ్లు వస్తే పోలీసులు విధులు చేయాల్సిన పని లేదు!’ అని ముఖ్యమంత్రి నుంచి లెటర్ తీసుకురాపోండి అని తరిమేసింది. ఇదంతా వీడియోకెక్కింది.ఇపుడు జరజరా పాకుతూ పోతున్నది.
 

Follow Us:
Download App:
  • android
  • ios