ఈ అలవాట్లు.. పురుషుల వీర్యకణాలను దెబ్బతీస్తాయి

First Published 5, Jan 2018, 3:09 PM IST
this Unhealthy Habits That May Be Killing Your Sperm
Highlights
  • కొన్ని చిన్న చిన్న  అలవాట్లు, మీరు తీసుకునే కొన్ని ఆహారాల కారణంగా వీర్య కణాలు దెబ్బతింటున్నాయి. దీని కారణంగా సంతాన లేమి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మారుతున్న నగర జీవనం, ఆహారపు అలవాట్లు.. ఇలా చాలా కారణాల వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతున్నాయి. అయితే.. మీకు తెలియకుండానే మీరు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా కూడా మీ వీర్య కణాల సంఖ్య తగ్గిపోతోందన్న విషయం మీకు తెలుసా. మీరు చదివింది నిజమే.. కొన్ని చిన్న చిన్న  అలవాట్లు, మీరు తీసుకునే కొన్ని ఆహారాల కారణంగా వీర్య కణాలు దెబ్బతింటున్నాయి. దీని కారణంగా సంతాన లేమి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ అలవాట్లు, పొరపాట్లు  ఏమిటో చూద్దాం...


కార్బొనేటెడ్ డ్రింక్స్..
చల్లని డ్రింక్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లోని వీర్యకణాలు తగ్గిపోతాయి. రోజుకి ఒకటికి మించి అలాంటి డ్రింక్స్ తాగితే.. ఈ సమస్యను మీరు కొని తెచ్చుకున్నట్లే. అంతేకాదు.. ఎక్కువగా బీర్లు తాగినా అదే సమస్య తలెత్తుంది. 


ప్యాంటు జేబులో ఫోన్..
మీ మొబైల్ లేదా స్మార్ట్ ఫోన్ ని ఎప్పుడూ మీ షర్ట్ ఫ్రంట్ జేబులోనే పెట్టుకోవాలి. ఫ్రంట్ పాకెట్ లో పెట్టుకుంటే.. ఎవరైనా కొట్టేస్తారేమో అని చాలా మంది ప్యాంట్ పాకెట్ లో పెట్టుకుంటారు. అయితే.. అలా పెట్టుకోవడం వల్ల వీర్యకణాలు దెబ్బతింటాయి. ఫోన్ కి వచ్చే రేడియేషన్స్ కారణంగా ఈ సమస్య తలెత్తుంది. నిపుణుల పరిశోధన ప్రకారం ప్యాంట్ జేబులో ఫోన్ పెట్టుకోవడం వల్ల వీర్యకణాలు 9శాతానికి పడిపోతాయని తేలింది.


ఒడిలో ల్యాప్ టాప్..
చాలా మంది ఇంట్లో వర్క్ చేసే సమయంలో ల్యాప్ ట్యాప్ ని ఒడిలో పెట్టుకొని చేస్తుంటారు. అలా చేయడం వల్ల మీకు పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. అంటే.. మీలోని పురుష కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో సంతాన లేమి సమస్యలు ఎదురౌతాయి.


వేడి నీటితో స్నానం..
రోజంతా ఏదో పని చేసి అలసిపోయిన వాళ్లు.. వేడి వేడి నీటితో షవర్ బాత్ చేయడానికి ఇష్టపడతారు. కానీ.. అది కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అంతటి వేడిని శరీరం తట్టుకున్నట్లుగా పురుషాంగం తట్టుకోలేదట. దీంతో.. వీర్యానికి సమస్య ఎదురౌతుంది.
నిద్రలేమి..
పురుషుల్లో వీర్యకణాలు దెబ్బతినడానికి నిద్ర లేమి కూడా ఒక కారణం అంటున్నారు నిపుణులు. మంచి నిద్ర, మంచి ఆహారం తీసుకున్నప్పుడే.. వీర్యకణాలు సమృద్ధిగా ఉంటాయి. రోజుకి కనీసం 7నుంచి 8గంటల నిద్ర పురుషులకు చాలా అవసరం అంటున్నారు నిపుణులు. మీ వీర్యకణాల సంఖ్య తగ్గకుండా ఉండాలంటే యోగా చేస్తే మంచిదని సూచిస్తున్నారు.
టైట్ జీన్స్..
స్లిమ్ ఫిట్ జీన్స్.. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ వాటి కారణంగా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి అలాంటి జీన్స్ కి కూడా దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

loader