కరీం ట్యాక్సీ  యాప్ ట్యాక్సీలో రిష్తా  ఆంటీ ఉంటుంది ఈ వినూత్న కార్యక్రమం కిస్థాన్ లో   ఏర్పాటు చేశారు.

సాధారణంగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లు ఏం చేస్తారు..? వారి తగ్గ వధువు/ వరుడుని ఏవరైనా బ్రోకర్ ద్వారానో.. ఏదైనా 
మ్యాట్రీ మోనీ వెబ్ సైట్ ద్వారోనో ఎంచుకుంటారు. కానీ ఇక్కడ ట్యాక్సీ ఎక్కితే చాలు. ట్యాక్సీ ఎక్కితే పెళ్లి ఎలా కుదురుతుందనేగా మీ
డౌట్.. ఇంకెందుకు ఆలస్యం చదవండి..

పాకిస్థాన్ లో ఇటీవల ‘కరీం’ పేరిట ఓ ట్యాక్సీ యాప్‌ ని విడుదల చేశారు. అయితే సాధారణంగా ఏదైనా ప్రాంతానికి 
వెళ్లడానికి ట్యాక్సీ బుక్ చేసుకుంటారు. కానీ ఈ ట్యాక్సీని మాత్రం పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి బుక్‌ 
చేసుకోవాలి. అయితే ఈ ట్యాక్సీ బుక్‌ చేసుకున్నవారితో ఓ మహిళ కూడా ఉంటుంది. 
ఆమెని ‘రిష్తా ఆంటీ’ అని పిలుస్తారు.

ట్యాక్సీలో వెళుతూ తమకు కాబోయే భార్య/భర్త ఎలా ఉండాలి.. చదువు, ఉద్యోగం, జీతం, ఎత్తు, బరువు తదితర 
 విషయాలన్నీ రిష్తా ఆంటీకి తెలియజేయాలి. ఇలా పెళ్లి సంబంధం గురించి ఏం మాట్లాడాలన్నా ఈ ట్యాక్సీలో వెళుతూ మాట్లాడాలి.. 
ఒకవేళ మనం చెప్పిన లక్షణాలతో అబ్బాయి లేదా అమ్మాయి దొరికి.. అన్ని కుదిరితే ‘రిష్తా ఆంటీ’ సంబంధం
 ఖాయమైనట్లు యాప్‌ ద్వారా మెసేజ్‌ పంపుతుంది. ఇందుకోసం మనం వారికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రిష్తా ట్యాక్సీ చాలా
వినూత్నంగా ఉంది కదూ...