ఈ నెయిల్ పాలిష్ కొనగలరా..?

This nail polish will roughly cost you  above one and half crore
Highlights

  • 267 క్యారెట్ల నలుపు రంగు వజ్రంతో దీన్ని తయారు చేయడమే ఇందులో విశేషం.

నెయిల్ పాలిష్.. ఇష్టపడని అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. చాలా మంది అమ్మాయిలు రోజుకో రంగు నెయిల్ పాలిష్ వేసుకొని మురిసిపోతుంటారు. నెయిల్ పాలిష్ ని విపరీతంగా ఇష్టపడే వారిలో మీరు కూడా ఉన్నారా..? అయితే.. ఈ వార్త  మీకోసమే.

 ఇప్పటి వరకు మీరు చాలా రకాల నెయిల్ పాలిష్ లు చూసి ఉంటారు. చాలా వాటిని కొనుగోలు చేసే ఉంటారు. సాధారణంగా నెయిల్ పాలిష్ ఖరీదు ఎంత ఉండి ఉంటుంది..? రూ.20,రూ.30.. ఉంటుంది. అదే బ్రాండెడ్ అయితే.. రూ.200, రూ.300 ఉంటాయి. మహా అంటే.. రూ.1000 ఉంటుందేమో అంతే కదా. కానీ.. ఈ ఫోటోలో కనిపిస్తున్న  నెయిల్ పాలిష్ మాత్రం అలాంటిది.. ఇలాంటిది కాదు. ఇలాంటి దానిని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు కూడా. ఎందుకంటే.. దీని ఖరీదు అక్షరాలా రూ.1,63,66,000( కోటి..63లక్షలపైమాటే). మీరు చదివింది నిజమే. దీని ఖరీదు నిజంగానే కోటిన్నర పైనే.

అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌కు చెందిన అజాతురే అనే సంస్థ ఈ నలుపు రంగు నెయిల్ పాలిష్ ని మార్కెట్ లోకి తీసుకవస్తోంది. 267 క్యారెట్ల నలుపు రంగు వజ్రంతో దీన్ని తయారు చేయడమే ఇందులో విశేషం. వచ్చే నెల ఈ గోళ్ల రంగును మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీన్ని ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొనుగోలు చేయడానికి చూస్తుంటే.. అప్పుడే అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ అని చూపిస్తుందట. ఇంత ఖరీదైన నెయిల్ పాలిష్ కొనాలంటే.. వారి దగ్గర ఎన్ని కోట్ల ఆస్తులు ఉండాలో..

loader