ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. జాతకాలు చూడటం ఆనవాయితీ. చాలా మంది జాతకాలు కుదరకపోతే.. పెళ్లిళ్లు క్యాన్సిల్ కూడా చేస్తారు. అందుకే పెళ్లిళ్లలో జాతకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. జన్మరాశుల బట్టి వారి గుణగణాలు ఆధారపడి ఉంటాయనేది పెద్దల నమ్మకం. అందుకే జన్మ రాశులకు సరిపడే ఇతర రాశులకు చెందిన వారితోనే వివాహాలు జరపడానికి మొగ్గుచూపుతారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని భావిస్తారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. మీ రాశిని బట్టి.. మీరు ఎలాంటి పెళ్లి చేసుకుంటారో చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. అదేంటో చూద్దామా..

మేషం : మేషరాశి వారు ఎంతో వైభవంగా చాలా ఖరీదు తో కూడుకొని ఉండే వివాహాన్ని చేసుకొనే అవకాశాలు ఉన్నాయి. మీరు  వివాహం కోసం మరీ అంత ప్రకాశవంతమైన రంగులు కాకుండా తేలికపాటి రంగులు కలిగిన దుస్తులు ఎంచుకుంటారు.
వృషభం : సంప్రదాయం అనేది మీ నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. విలాసవంతంగా వేడుకలు చేసుకోవాలి మరియు ఎంతో ఉన్నతంగా ఉండాలి అని మీరు ఎక్కువగా కోరుకుంటారు. అన్నింటిలో అత్యుత్తమం కావలి అని కోరుకునే మీరు, ఇందులో కూడా విలాసవంతమైన ఖరీదైన హోటళ్లలో మీ పెళ్లి మరియు వేడుకలు జరగాలని కోరుకుంటారు. వారసత్వ కట్టడాలలో మరియు ఎంతో ఖ్యాతి గడించిన అందరికి తెలిసిన ప్రదేశాల్లో మీ పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వధువు ధరించే దుస్తులు ప్రముఖ డిజైనర్ల చేత రూపొందించబడినవి అయి ఉంటాయి.

మిథునం : సరదా మరియు వేడుకతో కూడిన వాతావరణంతో మీ పెళ్లి జరుగుతుంది. ఎందుచేతనంటే ఏ రాశి యొక్క వ్యక్తులు సమయాన్ని ఎంతో గొప్పగా గడపటానికి ఇష్టపడతారు. ఆరోజు మొత్తంలో ఒక్క క్షణం కూడా మీరు నిరుత్సాహపడరు. సంగీతం, ఆహారం, బంధుమిత్రులతో ప్రతి క్షణం ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. మీ జీవితం మొత్తంలోకి అత్యంత ప్రకాశవంతమైన, ఉత్తేజవంతమైన రోజుగా అది నిలిచిపోతుంది. మీకే కాకుండా ఆ వేడుకకు వచ్చిన అతిధులకు కూడా అది ఒక మధురానుభూతిని మిగులుస్తుంది.
కర్కాటకం.. కుటుంబ సభ్యులు మరియు అత్యంత దగ్గరి స్నేహితుల మధ్య పెళ్లి జరిగిపోతుంది. సరదాలకు మరియు ఉల్లాసవంతమైన వాతావరణానికి అస్సలు కరువు ఉండదు. మీరు ఏ ప్రదేశాన్ని అయితే అత్యంత ఎక్కువగా ఇష్టపడతారో అక్కడే వివాహం చేసుకోవాలని భావిస్తారు

సింహం : సింహరాశి అన్ని రాశులకు రాజు. ఈ రాశి వారు అత్యంత వైభవంగా వివాహం జరుపుకోవడానికి ఇష్టపడతారు. వీరి యొక్క వివాహం రాజుల వివాహం లాగా  జరుగుతుంది..

కన్యారాశి.. వీరి వివాహం చాలా గొప్పగా వెరైటీగా జరుగుతుంది. వీరి వివాహం గురించి అందరూ చర్చించుకుంటారు.

తుల : ఒక సాహసగాథలాగా వారి వివాహం జరుగుతుంది మరియు వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఊహాజనితమైన అలంకరణ, దేశవిదేశాల నుండి తెప్పించబడ్డ పూలు మరియు కొవ్వొత్తుల వెలుగు ఆరోజు పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి.

వృశ్చికం : ఈ రాశి యొక్క వ్యక్తులు ఎక్కువ వైభవంగా పెళ్లి జరుపుకుంటారు. వివాహానికి వచ్చిన అతిధులను మెప్పించడానికి దేశవిదేశాల నుండి నృత్యకారులు వచ్చినా ఆశ్చర్యపోకండి. మీరు పెట్టే ఆహారం మరియు పానీయాలు మీ యొక్క అభిరుచిని తెలియజేస్తాయి. ఈ రాశి వధువు లేదా వరుడు వచ్చినవారిని చూపుతిప్పుకోనివ్వరు. ఎందుచేతనంటే వారి యొక్క శైలి మరియు సొగసుకి చిరునామాగా నిలుస్తారు.
ధనస్సు : ఈ రాశివారు ఎంతో సాహసోపేతంగా వ్యవహరిస్తారు. వీరు వివాహాలను కొద్దిగా దూరప్రదేశాల్లో జరుపుకుంటారు. రోజు మొత్తం ఎంతో సరదా కార్యక్రమాలతో గడిపేస్తారు. వచ్చినవారిని కూడా ఎంతో ఆనందపరుస్తారు. దూరప్రదేశాల్లో వివాహం చేసుకొనే అవకాశం ఎక్కువ. సౌకర్యవంతంగా గడపటానికి మీరు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. ముఖ్యంగా మీరు ఎంచుకొనే దుస్తుల్లో సౌకర్యవంతంగా ఉన్నవాటికి ప్రాధాన్యతను ఇచ్చి అటువంటి వాటినే ఎంచుకుంటారు.
మకరం : సంప్రదాయబద్ధంగా వ్యవహరించే మకర రాశివారు ఆ రోజుని ఎంతో గొప్పగా మరియు అందంగా జరుపుకుంటారు. వారసత్వ ప్రదేశాల్లో, మీకు నచ్చిన ప్రదేశాల్లో అందరూ మెచ్చే దగ్గర అత్యంత గొప్పగా అందరిని ఆశ్చర్యపరిచే విధంగా ఉండే దగ్గర మీ వివాహం జరుగుతుంది. అమ్మాయిలు కుటుంబ వారసత్వంగా వచ్చే దుస్తులను ధరించడం మంచిది. వారి యొక్క అమ్మమ్మ లేదా నాన్నమ్మ బహుకరించిన బహుమతిని వేసుకోవడం ఉత్తమం. కానీ, వాటిలో ఎటువంటి ఆధునికపోకడలు లేకుండా చూసుకోవడం మంచిది.
కుంభం : ఎంతో ఉత్సాహవంతంగా దేనిని పెద్దగా పట్టించుకోని కుంభరాశి వారు పెళ్లి విషయంలో సంప్రదాయాలకు చాలా దూరంగా జరుపుకుంటారు. సనాతన ఆచారాలకు దూరంగా వీళ్ళు వారి పెళ్లిని జరుపుకుంటారు. కావున ఇలాంటి వారి పెళ్ళికి వెళ్లే అతిధులు అనుకోని వాటిని చూడటానికి సిద్దపడి వెళ్ళాలి. ఉదాహరణకు వధువు పెద్దగా అలంకరించుకోకుండానే పెళ్లి పీటల పై కూర్చోవచ్చు, మాములు దుస్తులు ధరించి ఉండవచ్చు.

మీనం : ఈ రాశివారు ఊహల్లో ఎక్కువగా బ్రతుకుతుంటారు. ఎదో సినిమాల్లో జరిగే వివాహంలా వీరి వివాహం జరగాలని భావిస్తుంటారు. ప్రేమని పెంపొందించే సంగీతం, ఖరీదైన అలంకరణ మరియు అందమైన చెలికత్తెలు ఇలా ఎన్నో ఉహించుకుంటుంటారు. మీ యొక్క ఊహలు నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు నిజానికి చాలా దూరంగా కూడా జరగవచ్చు. మీ యొక్క వివాహం సాహసోపేతమైన కథలకు చాలా దగ్గరా మరియు వాటినే చుస్తున్నామా అనే అనుభూతిని కలిగించే విధంగా కూడా ఉంటాయి.