పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లితో ఒక్కటైన దంపతులు.. జీవితాతం ఆనందంగా కలిసి ఉండటంలో.. శృంగారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. పెళ్లి జరిగిన రెండో రోజో, మూడో రోజు పెద్దలు.. నూతన దంపతులకు ‘ ఫస్ట్ నైట్’ ఏర్పాటు చేస్తారు. అయితే.. నూటికి 70శాతం దంపతుల విషయంలో ఫస్ట్ నైట్ సక్సెస్ కావని నిపుణులు చెబుతున్నారు. ఎందుకిలా? అంటే...అదే తొలి అనుభవం అయితే కచ్చితంగా ఇద్దరికీ ఒత్తిడి ఉంటుంది. కంగారూ ఉంటుంది. పైగా ఒకరికొకరు కొత్త. శోభనం గది చుట్టూ రెండు కుటుంబాల బంధువులు...ఇన్ని ఇబ్బందులున్నప్పుడు అంతో ఇంతో ఒత్తిడి పెరగటం సహజం.  దీంతో.. పూర్తి స్థాయిలో ‘అసలు’ వ్యవహారంపై దృష్టపెట్టలేరట. ఫస్ట్ నైట్ ఫెయిల్ అవ్వడానికి ఇది ప్రధాన కారణం కాగా.. అబ్బాయిల అత్యుత్సాహం రెండో కారణం అంటున్నారు నిపుణులు.
తొలిసారి ది బెస్ట్‌ అనిపించుకోవాలనే తాపత్రయం అందరికీ ఉండటం సహజం. అయితే ఇందుకోసం విపరీతంగా ఎక్సయిట్‌ అయిపోయి ఖంగు తినేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అబ్బాయిలు. దాంతో వాళ్ల వాలకం చూసి అమ్మాయిలు అతనికేదో లోపం ఉందనే నిర్థారణకొస్తారు. అనవసరంగా అత్యుత్సాహం చూపించడం వల్ల కూడా ఫస్ట్ నైట్ సక్సెస్ చేసుకోలేకపోతున్నారని నిపుణులు తెలిపారు.