తొందర్లో రానున్న రు.200 నోటు?

This  is said to be the image of new Rs 200 note designed by RBI
Highlights

త్వరలో రిజర్వు బ్యాంకు రు. 200 నోటును తీసుకురావాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలలా వచ్చాయి, అపుడే ఇదే రానున్న రు.200 నోటు అని సోషల్ మీడియాలో ఈనోటు హల్ చల్ చేయడం మొదలుపెట్టింది.

త్వరలో రిజర్వు బ్యాంకు రు. 200 నోటును తీసుకురావాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకు మించి చెప్పేందుకు పెద్ద గా ఏమీ లేదీ విషయంలో.  కాకపోతే,  ఈ కొత్త నోట్లు ఎటిఎంలలో అందుబాటులో ఉండవని , కేవలం బ్యాంకుల ద్వారానేపొందాల్సి వుంటుందని తెలుస్తున్నది. అంతే, ఇదే రెండొందల నోటు అని పై బొమ్మలోని రుపాయనోటు సోషల్ మీడియా జర జరా పాకిపోతున్నది. రిజర్వు బ్యాంకు నుంచి ఇంకా ఎలాంటి వివరణ వెలువడలేదు.

 

మీడియా కథనాల ప్రకారం, ఈ నోటో డిసెంబర్ నాటికి చలామణిలోకి వస్తుంది. రిజర్వు బ్యాంకు అపుడే ఈ నోట్లను ముద్రించేందుకు  చర్యలు మొదలుపెట్టిందని కూడా చెబుతున్నారు.

 

ఇపుడు చిన్న చోట్ల సమస్య తీవ్రంగా ఉన్నందున రిజర్వు బ్యాంకు ఈ కొరత తీర్చేందుకు రెండొందల నోటు గురించి యోచించింది. ఇపుడు చలామణిలో కేవలం పెద్ద నోట్లే ఎక్కువగా ఉన్నాయి. రెండు వేల నోటు తర్వాత అయిదొందల నోటు. దీని తర్వాత వంద నోటు. ఇక మధ్యలో ఏమీ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేయినోటు వస్తుందని చెబుతున్నా, రిజర్వు బ్యాంకు నుంచి ఇంకాఎలాంటి ప్రకటన రాలేదు.

 

ఈ నేపథ్యంలో మార్చినెలలో రిజర్వు బ్యాంకు కేంద్ర ఆర్ధిక శాఖతో సంప్రదించి కొత్త రెండొందల నోటు గురించి  ముద్రణకు నిర్ణయం తీసుకుంది. తొందరల్లో ఆర్ బిఐ స్వయాంగా ఈ నోటు మీద ఒక ప్రకటన చేయబోతున్నదని తెలిసింది.

loader