ఈ బార్ ఓనరు కోర్టు కంటే కాస్త ఎక్కువే లా చదవి ఉంటాడు. అందుకే న్యాయస్థానం ఆదేశాలను తూచా తప్పకపాటిస్తూనే తన మందు బుద్దితో ఓ గొప్ప ఐడియాను ఆచరణలో పెట్టాడు.

నేతలకే రాజకీయాలు నేర్పేలా ఉన్నాడు కేరళలోని ఈ బార్ ఓనరు. నొప్పించక తానొవ్వక చక్కగా తన పనిచక్కబెట్టుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే కేరళలోని ఎర్నాకులంలో ఐశ్వర్య పేరుతో ఓ బార్ నడుస్తోంది.

అయితే ఇది జాతీయ రహదారి 17కు ఆనుకొని ఉండటం పెద్ద సమస్యగా మారింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మందు షాపులు జాతీయ రహదారికి 300 మీటర్ల లోపు ఉండకూడదు. అలా ఉంటే షాపులను మూసివేయాల్సిందే. దీంతో ఐశ్వర్య బార్ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది.

అయితే ఈ బార్ ఓనరు కోర్టు కంటే కాస్త ఎక్కువే లా చదవి ఉంటాడు. అందుకే న్యాయస్థానం ఆదేశాలను తూచా తప్పకపాటిస్తూనే తన మందు బుద్దితో ఓ గొప్ప ఐడియాను ఆచరణలో పెట్టాడు.

జాతీయ రహదారికి 300 మీటర్ల లోపే ఉన్న తన బార్ షాపు మెయిన్ ఎంట్రెన్స్ ను మూసివేశాడు. దానికి ప్రత్యామ్నాయంగా పై ఫొటోలో చూపెట్టినట్లు గజిబిజిగా రోడ్డుకు 300 మీటర్లు దూరం ఉండేలా తన బారు కు దారి ఏర్పటు చేశాడు. దీనికి రూ. లక్షన్నర వరకు ఖర్చు చేశాడు.

డబ్బులు పోతే పోయాయి కాని బార్ మాత్రం మూతపడలేదు. కోర్టు నిబంధనలను ఉల్లంఘించలేదు. దీంతో కేరళలోని ఇతర బార్ ఓనర్లు ఇదే దారిలో నడిచేందుకు సిద్దమవుతున్నారు.