ఈ దొంగ చాలా స్మార్ట్ గురు (వీడియో)

ఈ దొంగ చాలా స్మార్ట్ గురు (వీడియో)

చైనాలోని ఓ యువకుడు మిగతా దొంగల్లా కాకుండా చోరీకి కొత్త దారి ఎంచుకున్నాడు. షాపు షెట్టరు పగలకొట్టడం.. గోడలు దూకడం మాములు అనుకున్నాడేమో కానీ.. సైలెంట్‌గా పని కానిచ్చాడు. ఓ బక్క పల్చని దుండగుడు.. మే 13 రాత్రి ఆ జ్యుయలరీ షోరూం దగ్గరకు వచ్చాడు. కొంత సేపు అక్కడ కూర్చున్నాడు 

షట్టర్‌ను మెల్లిగా తన చేతులతో పైకి నెడుతూ, తన శరీరాన్ని గట్టిగా ఒత్తుకుంటు.. చిన్నగా షాపులోకి ప్రవేశించాడు. మనోడు షోరూంలోకి వెళ్లగానే అలారం మోగింది ఏ మాత్రం అలస్యం చేయకుండా అలారమ్‌ ఆఫ్‌ చేశాడు. 

ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో బంగారు నగలన్నీ సర్దుకున్నాడు. అదే షట్టర్ కింది భాగం నుంచి బయటికి వచ్చాడు. బ్యాగ్‌ను తీసుకున్నాడు. ఏమీ ఎరగనట్టు అక్కడినుంచి తుర్రుమన్నాడు. 

తర్వాత సీసీ పుటేజ్‌ను చూసి అసలు విషయం తెలుసుకున్నారు. దాదాపు 36లక్షల విలువ కలిగిన 40 బ్రెస్‌లెట్స్‌, నక్లెస్‌లు, ఉంగరాలు చోరీకి గురయినట్టు ఆ షాప్‌ యాజమాని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సీసీటీవీలో రికార్డయిన వీడియో ఆధారంగా దుండగుడి కోసం వేట ప్రారంభించారు. 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page