ప్రస్తుత కాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నవారే. ఉదయం ఎప్పుడో ఆఫీసుకి వెళితే.. మళ్లీ ఇంటికి చేరుకునేది ఏ రాత్రికో. సరదాగా గడపడానికి కూడా సమయం దొరకని రోజులు ఇవి. కాస్తో కూస్తో ప్రశాంతత లభించేంది రాత్రి సమయంలోనే.  అయితే.. ఆ సమయంలో ముఖ్యంగా బెడ్ మీద ఉన్నప్పుడు ..మీ పార్టనర్ ని కొన్ని ప్రశ్నలు అడగకూడదు అంటున్నారు నిపుణులు. ఆ ప్రశ్నల కారణంగా.. ఇద్దరి మూడ్ దెబ్బతింటుందని.. అంతేకాకుండా సెక్స్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేయలేరని అంటున్నారు. మరి ఆ ప్రశ్నలేంటో చూద్దామా...

మాజీ ప్రేమికులు..

చాలా మంది ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోరు. ఒకరిని ప్రేమించి మరొకరిని వివాహం చేసుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. అయితే.. వారి గత ప్రేమికుల గురించి బెడ్ మీద పార్టనర్ ని అడగకూడదట. అలా అడగటం వారికి ఏ మాత్రం నచ్చదట. మీతో ఏకాంతంగా ఉన్నసమయంలో వారిని గుర్తుచేసి బాధపెట్టినవారు అవుతారు.

పని..

మీకు ఆఫీసులో ఎంతో వర్క్ ఉండి ఉండొచ్చు.. కానీ.. మీ పార్టనర్ రొమాంటిక్ మూడ్ లో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావించకూడదు. సెక్స్.. మీ ఒత్తిడిని తగ్గిస్తుందన్న విషయం తెలుసుకోవాలి. ఆ సమయంలో ఇలాంటి విషయాల గురించి చర్చిస్తే.. మీ పార్టనర్ మూడ్ దెబ్బతినే అవకాశం ఉంది.

పేరెంట్స్..

మీ తల్లిదండ్రులు, బ్రదర్, సిస్టర్.. ఇలా మీ కుటుంబసభ్యులు ఎవరైనా మీకు ముఖ్యమే కావచ్చు.. కానీ.. ఆ సమయంలో.. అయ్యో.. అమ్మ ఇందాక ఎందో ఫోన్ చేసింది.. ఇప్పుడు మాట్లాడాలి. లాంటి ఆలోచనలు కాసేపు పక్కనపెట్టాలి.

గొడవలు..

భార్య భర్తలు అన్నాక.. గొడవలు సర్వసాధారణం. అయితే.. ఆ గొడవ సద్దుమణిగాక మళ్లీ మునుపటిలాగే ఉంటారు. కానీ.. అయిపోయిన గొడవలను అక్కడితో వదిలేయాలి. ఇద్దరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆ గొడవను గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు.

పర్సనాలిటీ..

మీ పార్టనర్ పర్సనాలిటీ ఎలా ఉన్నా.. ఆ విషయం గురించి బెడ్ మీద ఉన్నప్పుడు చర్చించకండి. నీ ఫ్రంట్ ప్లాట్ గా ఉంది.. నీవు లావుగా ఉన్నావు.. లాంటి విషయాలను ఆ సమయంలో చర్చించకపోవడం మంచిది. ఎందుకంటే మీ పార్టనర్ హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది.