ఇవి తింటే మీ తెలివి తెల్లవారుతుంది

these foods to help boost your memory
Highlights

  • శరీరంలోని మిగతాభాగాల ఆరోగ్యం కూడా ఒకోసారి మెదడు మీద కనిపిస్తుంది. అందుకే... ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మెదడుకి మంచిదో సూచిస్తున్నారు నిపుణులు.

మెదడు కూడా మన శరీరవ్యవస్థలో ఒక భాగమే! దానికీ తగినంత నీరు కావాలి. దానికీ సరిపడా పోషకపదార్థాలు చేరుతుండాలి. అందుకే మనం తీసుకునే ఆహారపు ప్రభావం ఎంతోకొంత మన మెదడు పనితీరు మీరు ఉంటుంది. అంతేకాదు! శరీరంలోని మిగతాభాగాల ఆరోగ్యం కూడా ఒకోసారి మెదడు మీద కనిపిస్తుంది. అందుకే... ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మెదడుకి మంచిదో సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దామా..

మెగ్నీషియం...

మెగ్నిషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు.. ప్రశాంతంగా నిద్రకూడా పోతారు. ఆకుపచ్చని కూరగాయాలు, పాలకూర వంటి వాటిల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బీన్స్ లో కూడా మెగ్నీషియం అధిక మొత్తంలో లభిస్తుంది. ఇవి ఆహారంగా తీసుకుంటే.. మెమరీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా బాదంపప్పు, వాల్ నట్స్, జీడిపప్పు, అవొకాడోల్లో కూడా మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

జింక్..

మతిమరుపు తగ్గించే మరో చక్కని పరిష్కారం జింక్. వయసు పెరిగే కొద్ది చాలా మందిలో అల్జీమర్స్ అనే జబ్బు వస్తుంటుంది. ఇది రాకుండా ఉండాలంటే.. జింక్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పుచ్చకాయ గింజలు, బీఫ్ లలో జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్...

ఒమేగా -3ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకుంటే బుర్ర చురుకుగా పనిచేస్తుంది. ఫిష్, సోయా బీన్స్, కనోలా ఆయిల్, చియా సీడ్స్, వాల్ నట్స్ లో ఈ ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

loader