న్యూఇయర్ రోజున ఈ ఫుడ్ తింటే.. వారు పట్టిందల్లా బంగారమే

First Published 30, Dec 2017, 1:20 PM IST
these Foods That Will Bring You Good Luck in the New Year
Highlights
  • కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల న్యూ ఇయర్ లో అదృష్టం పొందవచ్చు. నమ్మడానికి విడ్డూరంగా ఉండవచ్చు. కానీ.. చైనీస్, థాయ్ సంస్కృతుల ప్రకారం ఇది అక్షరాల నిజం

 న్యూ ఇయర్ అనగానే మనలో చాలా మందికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ నూతన సంవత్సరంలో అది చేసేయాలి, ఇది చేసేయాలి అని ప్రణాళికలు కూడా వేసుకుంటారు. ఇవన్నీ పక్కనపెడితే.. ఈ నూతన సంవత్సరంలో కొన్ని పనులు చేస్తే మనకు  అదృష్టం కలిసి వస్తుందట. ఆ పని ఏంటో తెలుసా..? తినడం. మీరు చదివింది నిజమే.. కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల న్యూ ఇయర్ లో అదృష్టం పొందవచ్చు. నమ్మడానికి విడ్డూరంగా ఉండవచ్చు. కానీ.. చైనీస్, థాయ్ సంస్కృతుల ప్రకారం ఇది అక్షరాల నిజం. ప్రపంచంలోని చాలా దేశాలు వీటిని ఫాలో అవుతున్నాయి. అవేంటో మనమూ చూద్దామా..

1.పచ్చని కూరగాయలు..

ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటామన్న విషయం మనకు తెలుసు. అయితే.. ఇవే మనకు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయట. చాలా దేశాల్లో పాలకూర, బీన్స్ లాంటి ఆకుపచ్చని కూరగాయలను డబ్బు రావడానికి సూచనగా భావిస్తారట. కాబట్టి వీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే.. అంత డబ్బు సంపాదించవ్చనమాట.

2.నూడిల్స్..

చైనా దేశస్థులు ఎక్కువగా నూడిల్స్ తింటుంటారు. ఎందుకో తెలుసా..? దీనికి పెద్ద కారణమే ఉంది. నూడిల్స్ చాలా పొడవుగా ఉంటాయి. వాటిని తినడం వలన వాటి పొడవులాగానే ఎక్కువ కాలం జీవిచ్చవచ్చని వారి నమ్మకం. వాటిని వండేటప్పుడు నూడిల్స్ ముక్కలు కాకుండా చూసుకుంటారు. న్యూఇయర్ రోజు కచ్చితంగా తింటారు.

3.  దానిమ్మ..

టర్కీ దేశస్థులు న్యూ ఇయర్ రోజున కచ్చితంగా దానిమ్మ జ్యూస్ తాగుతారు. ఈ జ్యూస్ తాగడం వల్ల వారి గుండె ఆరోగ్యంగా ఉంటుందని.. సంతానోత్పత్తి కూడా బాగా జరుగుతుందని వారి నమ్మకం. అదేవిధంగా యాపిల్.. ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.

4.చేపలు..

న్యూ ఇయర్ రోజు కచ్చితంగా చేపలు తింటే.. ఆ సంవత్సరం అదృష్టం కలిసివస్తుందట. ఇది చాలా దేశాల్లో సాంప్రదాయంగా వస్తోంది. సంపద, శ్రేయస్సు కలిసివస్తాయని వారి నమ్మకం.

5.నట్స్..

కొత్త జీవితం ఆరంభానికి నట్స్ ని సింబాలిక్ గా భావిస్తారు. అందుకే చాలా మంది న్యూ ఇయర్ రోజు బంధువులకి, మిత్రులకు నట్స్.. కానుకగా ఇస్తారు. ఈ సంవత్సరం అంతా వారికి అదృష్టం కలిసిరావాలనే భావనతో వాటిని ఇస్తారట. లేదంటే నట్స్ తో చేసిన స్వీట్స్, కేక్స్ పంచిపెడతారు. వాటిని తింటారట.

6. మొక్కజొన్న..

న్యూ ఇయర్ రోజు యుఎస్ లో చాలా మంది కార్న్ బ్రెడ్ తయారు చేస్తారు. కార్న్ తో చేసిన ఫుడ్స్ ని ఆహారంగా తీసుకుంటారు. వారి నమ్మకం ప్రకారం.. కార్న్ ని బంగారానికి చిహ్నంగా భావిస్తారు. వాటిని తీసుకుంటే.. ఆ ఏడాది బంగారం కలిసి వస్తుందనేది వారి నమ్మకం. వీటితోపాటు ద్రాక్ష, ఆరెంజెస్ కూడా అదృష్టాన్ని తీసుకువస్తాయని వారి నమ్మకం.

 

loader