Asianet News TeluguAsianet News Telugu

అందులో నెగ్గాలంటే.. పురుషులు తినకూడని ఫుడ్స్ ఇవే

  • కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే.. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది.
these  Foods That Hurt Male Fertility

మనిషి ఆరోగ్యంగా ఉండటంలో తీసుకునే ఆహారానిదే ముఖ్య పాత్ర. మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.  అంతేకాదు.. వారు తీసుకునే ఆహారమే.. వారి సంతానోత్పత్తి కి కూడా కారణమౌతాయి అంటున్నారు నిపుణులు. పురుషులు తీసుకునే ఆహారాన్ని బట్టి.. వారిలో సంతానోత్పత్తి పెరగడం, తగ్గడం లాంటివి ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. వారి సర్వే ప్రకారం.. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే.. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా...

ప్రాసెస్డ్ మీట్...

స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఎక్కువగా చేస్తే.. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందని మనందరికీ తెలుసు. కేవలం వాటి వల్లనే కాదు.. ప్రాసెస్డ్ మీట్ తినడం వలన కూడా ఈ సమస్య ఎదురౌతుందట. సాధారణ మాంసాహారం తింటే ఎలాంటి సమస్య ఉండదు. అలా కాకుండా బర్గర్స్, పిజ్జా, హాట్ డాగ్స్ వంటి వాటిల్లో పెట్టే ప్రాసెస్డ్ మాంసం తింటే మత్రం వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది.

డెయిరీ ప్రొడక్ట్స్...

పాలు, పెరుగు లాంటి డెయిరీ ప్రొడక్ట్స్.. చాలా ఆరోగ్యకరం. కానీ.. ఇవే పాలు, పెరుగు పురుషుల కొంప ముంచేస్తున్నాయి. పాలు, చీజ్ వంటి వాటిల్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువ కొవ్వు ఉన్నవాటిని రోజూ తీసుకుంటే.. వీర్యకణాల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా యువకల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందంటున్నారు. కాబట్టి కాస్త ఫ్యాట్ తక్కువగా ఉండేలా డెయిరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం మంచిది.

కూల్ డ్రింక్స్..

చల్లని డ్రింక్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్  ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లోని వీర్యకణాలు తగ్గిపోతాయి. రోజుకి ఒకటికి మించి అలాంటి డ్రింక్స్ తాగితే.. ఈ సమస్యను మీరు కొని తెచ్చుకున్నట్లే. అంతేకాదు.. ఎక్కువగా బీర్లు తాగినా అదే సమస్య తలెత్తుంది. 

 

నాన్ ఆర్గానిక్ ఫుడ్స్..

నాన్ ఆర్గానిక్ ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు వైద్యులు. నాన్ ఆర్గానిక్ ఫుడ్స్ ని పెంచేక్రమంలో  ఎక్కువ మొత్తంలో పురుగుల మందులు వాడతారు. వాటి కారణంగా  కూడా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. కాబట్టి వాటికి దూరంగా ఉంటూ.. ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios