వైవాహిక బంధంలో శృంగారానిది పెద్ద పీట. మారుతున్న ఆహారపు అలావాట్లు, పని ఒత్తిడి కారణంగా చాలా మందిలో  లైంగిక ఆసక్తి తగ్గిపోతోంది. ఈ లైంగిక ఆసక్తి పెరగడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకునే ముందు.. ఏవి తినకూడదో తెలుసుకోవడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. మరి లైంగిక ఆసక్తి తగ్గించే ఫుడ్స్ ఎంటో ఒకసారి చూసేద్దామా..

లైంగిక జీవితాన్ని చక్కగా అనుభవించదలచుకున్నవారు మొక్కజొన్న కండెలు తినడాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదట. సెక్స్‌ పట్ల ఆసక్తి తగ్గడం కోసమే డాక్టర్‌ జాన్‌ హార్వీ కెలాగ్‌ అనే పెద్ద మనిషి మొక్కజొన్న గింజల ప్యాకెట్లను అమ్మే వ్యాపారంలోకి దిగారన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మొక్కజొన్న గింజలను వేయించుకుని పాప్‌కార్న్‌ పేరుతో చాలామంది తింటుంటారు. ఇది సెక్స్‌ జీవితానికి ఉపయోగపడడం లేదని, లైంగిక పటుత్వాన్ని తగ్గిస్తోందని డాక్టర్‌ క్రిస్టఫర్‌ చెప్పారు.అందువల్ల పడక గదిలో పాప్‌కార్న్‌ను, కార్న్‌ఫ్లేక్స్‌ను పొరపాటున కూడా ఉపయోగించవద్దని, వాటిని నోట్లోకి ఎగరేసుకుంటూ ఎంజాయ్‌ చేద్దామన్న ఆలోచన మొదటికే మోసం తెస్తుందని నిపుణులు  చెబుతున్నారు.

ఇక చిప్స్ వంటివి తినడం కూడా సెక్స్ జీవితానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ప్రస్తుత కాలంలో ప్రతి ఆహార పదార్థానికి నకిలీ తయారౌతోంది. కాబట్టి.. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించి.. నకిలీ ఫుడ్స్ కి దూరంగా ఉండటం మంచిది. అందరూ ఎంతో ఇష్టంగా తినే పిజ్జా కూడా లైంగిక ఆసక్తిని పూర్తిగా తగ్గించేస్తుందని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు.. వేపుడు కూరలు, నూనెలో వేయించే ఏ పదార్థాలైనా అతిగా తినడం మంచిది కాదంటున్నారు. వాటికి ఎంత ఎక్కువ దూరంలో ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు. ఉదయాన్నే లేవగానే చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉటుంది. రోజుకి ఒక్కసారి తాగితే పర్లేదు కానీ.. అంతకుమించి తాగితే నష్టమే అంటున్నారు నిపుణులు. ఉదయం తాగిన కాఫీ కప్పుల ప్రభావం రాత్రికి చూపిస్తుందట. మూడ్ రాకపోగా.. కోపం, చిరాకు,గుండె దడ లాంటివి వస్తాయని అంటున్నారు.