ప్రేమికుల రోజు ( వాలంటైన్స్ డే)న ముఖ్య పాత్ర పోషించేవాటిలో మొదటి స్థానం గిఫ్ట్స్ కి ఉంటుంది. ‘‘ నాకు ఎలాంటి గిఫ్ట్స్ అవసరం లేదు నీ ప్రేమ ఉంటే చాలు’’ అని పైకి చెప్పినా.. మనసులో మాత్రం బాయ్ ఫ్రెండ్ నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ అందుకోవాలని ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది. దానిని అర్థం చేసుకొని దాదాపు అబ్బాయిలందరూ తమకు తోచిన బహుమతులను అందజేసి సర్ ప్రైజ్ చేస్తుంటారు. అయితే.. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడని గిఫ్ట్స్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా అబ్బాయిలు.. అమ్మాయిలకు ఈ వాలంటైన్స్ డే రోజు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం...

గ్రీటింగ్ కార్డ్స్, టెడ్డీ బేర్స్...

గిఫ్ట్స్ అనగానే చాలా మందికి ముందు గుర్తుకు వచ్చేది టెడ్డీ బేర్స్, గ్రీటింగ్ కార్డ్స్. కానీ వీటికాలం చెల్లిపోయి చాలా కాలం అవుతోంది. చాలా మంది అమ్మాయిలు వీటిని గిఫ్ట్స్ గా పొందేందుకు ఇష్టపడటం లేదు అనేది వాస్తవం. అంతేకాదు ఈ- గ్రీటింగ్ కార్డ్స్ కూడా అమ్మాయిలకు అసలు నచ్చని గిఫ్ట్స్. కాబట్టి  వీటికి స్వస్తి పలకడం మంచిది.

పెన్సిల్, షార్పనర్...

చాలా మంది మనం ఇచ్చే గిఫ్ట్ ఉపయోగపడేలా ఉండాలి అని ఆలోచిస్తారు. కరెక్టే ఉపయోగపడే బహుమతి ఇస్తే మంచిదే. అలా అని చీప్ గా పెన్సిల్, షార్పనర్ లాంటి స్టేషనరీ గిఫ్ట్స్ ఇవ్వడం మంచిది కాదు.

డ్రస్..

అదేంటి కనీసం డ్రస్ కూడా గిఫ్ట్ గా ఇవ్వకూడదా..? అని ఆశ్చర్యపోకండి. డ్రస్ గిఫ్ట్ గా ఇవ్వడం లో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. పాత గర్ల్ ఫ్రెండ్ కొనిచ్చిన గిఫ్ట్.. బ్రేకప్ తర్వాత తిరిగి మళ్లీ ఇచ్చేసింది కదా.. దానిని  ప్రస్తుతం ఉన్న గర్ల్ ఫ్రెండ్ కి ఇద్దాం అనే ఆలోచనలు మాత్రం చేయకండి

రోడ్డుపక్కన కనిపించేవి..

వాలంటైన్స్ డే కి ఇచ్చే గిఫ్ట్ ఖరీదైనది అవ్వాల్సిన పనిలేదు. అలా అని ఏది పడితే అది కూడా ఇవ్వకూడదు. గిఫ్ట్ కొనడానికి టైమ్ లేదని చెప్పి.. దారిలో కనిపించిన చెత్త గిఫ్ట్స్ ఇవ్వకండి. అంతేకాదు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించే హార్ట్ షేప్ బెలూన్స్ కూడా పరమ చెత్త గిఫ్టే అవుతుంది. ఇవి మాత్రమే కాదు.. కీ చైన్స్ కూడా మంచి గిఫ్ట్ ఏమీ కాదు.

ఈ డేంజర్ బహుమతులు ఇస్తే.. ప్రేమికుల రోజే బ్రేకప్ చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంకో విషయం.. ఇచ్చే గిఫ్ట్ ని దాదాపు రెడ్ కలర్ లో హార్ట్ షేప్ లో ఉండేలా చూసుకోండి.