Asianet News TeluguAsianet News Telugu

ఆ తీర్పు వెనుక..  ఈ యువ న్యాయవాదుల కృషి ఉంది..

  • వ్యక్తిగత గోప్యతపై విచారణ చేపట్టిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్త్రత ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించింది
  • ఆర్టికల్‌ 21 ప్రకారం.. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తేల్చింది.
The Young Lawyers Behind Indias Right To Privacy Fight

భారత అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన ఓ తీర్పు సంచలనం సృష్టిస్తోంది.  వ్యక్తిగత గోప్యత( ఇండివిడ్యువల్ ప్రైవసీ) అనేది వ్యక్తుల ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యక్తిగత గోప్యతపై విచారణ చేపట్టిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్త్రత ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించింది. ఆర్టికల్‌ 21 ప్రకారం.. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తేల్చింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన రెండు తీర్పులను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే.. అయితే.. దీని వెనుక నలుగురు యువ న్యాయవాదుల కృషి దాగి ఉంది.

 

దేశంలోని ప్రజలందరికీ ఆధార్ తప్పనిసరి చేస్తూ.. అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దీనికి వ్యతిరేకంగా 2012లో కర్ణాటక హైకోర్టు జడ్జి కేఎస్ పుట్టస్వామి మొదట పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు అరవింద్‌ దాతర్‌, శ్యామ్‌ దివాన్‌, గోపాల్‌ సుబ్రమణ్యం, ఆనంద్‌ గ్రోవర్‌లు తమ వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు..

 

కాగా..ఈ తీర్పు వెలువడటానికి నలుగురు యువ న్యాయవాదుల హస్తం ఉంది. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి.. విజయం సాధించారు. వారే ప్రసన్న, అపర్ గుప్త, గౌతమ్ భాటియా, క్రితికా భరద్వాజ్.

 

ప్రసన్న(34)..

ఈ యువ న్యయవాది .. తమిళనాడు రాష్ట్రంలోని హోసుర్ ప్రాంతానికి చెందిన వాడు. కోడర్ నుంచి న్యాయవాదిగా మారాడు.ఆధార్ తప్పనిసరి చేయడం పట్ల.. ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. దీని గురించి ప్రసన్న మాట్లాడుతూ.. ఆధార్ యునిక్ ఐడీ కలిగి ఉంటుందన్నారు. అది కేవలం ఒక మెషిన్ మాత్రమేనని..ఆయన అభిప్రాయపడ్డారు.

అపర్ గుప్త(33)

దేశరాజధాని ఢిల్లీకి చెందిన వాడు ఈ అపర్ గుప్త. కొలంబియా లా స్కూల్ లో గ్రాడ్యూయేట్ పూర్తి చేశాడు. ఆధార్ అనుసంధానంపై అపర్ మాట్లాడుతూ..

ప్రభుత్వం డిజిలిట్ డాష్ బోర్డ్ ఆధారంగా సమర్థవంతంగా పనిచేస్తున్నామనే భ్రమలో ఉందన్నారు. ఇది కొంత వరకు మంచిదే కానీ.. వ్యక్తి వ్యక్తిగత విషయాలు ఇందులో జోడించడం సరికాదన్నారు. దాదాపు రూ.11వేల కోట్లు ఈ ఆధార్ కోసం ప్రభుత్వం ఖర్చుపెట్టిందని ఆయన వెల్లడించారు.

 

గౌతమ్ భాటియా(28)

గౌతమ్.. బెంగళూరులోని నేషనల్ లా యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశారు.  సీనియర్ కౌన్సిల్ దాతర్ టీమ్ లో గౌతమ్ కూడా ఒకరు.ఈ ఆధార్ అనుసంధానం గురించి ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని సేకరిస్తుందన్నారు.

 

క్రితికా భరద్వాజ్(26)

క్రితికా భరద్వాజ్.. దిల్లీ నగరానికి చెందినది. ఆమె ఎల్ఎస్ఆర్ లో పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ చేశారు.దిల్లీ యూనివర్శిటీలో ఎల్ఎల్ బీ కూడా చేశారు. ఆధార్ గురించి ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాధమిక హక్కు కాదనే ప్రభుత్వ వాదన విని తాను షాక్ అయినట్లు చెప్పారు. దీనికి సంబంధించి ప్రాజెక్టులు కూడా పూర్తి చేశామని ఆమె తెలిపారు. ప్రభుత్వం దీనిపై తీసుకున్న నిర్ణయాన్ని ఎలాగైనా వెనక్కి తీసుకునేలా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

 

చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌తో పాటు.. న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్‌, ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్‌, ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, ఆర్‌కే అగర్వాల్‌, రోహిన్‌టన్‌ ఫాలీ నారీమన్‌, అభర్‌ మనోహర్‌ సాప్రే, సంజయ్‌ కిషన్‌ కౌల్‌లతో కూడిన తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం.. వ్యక్తిగత స్వేచ్ఛ.. ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ తీర్పు వెలువరిచిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios