ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ సోనీ.. తాజా స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. బార్సిలోనాలో జరుగుతున్న  మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ ఫోన్ ని ఆవిష్కరించింది. సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్ 2 కాంపాక్ట్ పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ ధర వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ఫోన్ ని యాంటీ స్క్రాచ్ పాలీ కార్బొనెట్ బాడీతో తయారు చేశారు.

సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్ 2 కాంపాక్ట్ ఫీచర్లు..

5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 19 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, , 2870 ఎంఏహెచ్ బ్యాటరీ.