చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి..మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి సన్నద్ధమౌతోంది. ఇప్పటికే అతి తక్కువ ధరకే రెడ్ మీ నోట్ 5, రెడ్ మీ నోట్ 5 ప్రో ఫోన్లను తాజాగా షియోమి భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కాగా.. ఇప్పుడు మరో ఫోన్ ని తీసుకువస్తోంది.

మరికొద్ది రోజుల్లో బార్సిలోనా వేదికగా మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌(ఎండబ్ల్యూసీ) 2018 జరగనుంది. దీనిలో ఎంఐ మ్యాక్స్‌3 ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో అత్యధికంగా 5500 ఎంఏహెచ్‌ సామర్థ్యంగల బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనిలో స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌ను ఉపయోగించారని సమాచారం. తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం ఈ ఫోన్ కి వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుందని తెలుస్తోంది. ఇక ఆండ్రాయిడ్‌ ఓరియోతో పాటు ఎంఐయూఐ9 తో పనిచేయనుందట.