‘‘బ్రేకప్’’ ప్రస్తుత కాలంలో ఇది చాలా కామన్ గా వినపడుతున్న మాట. కొద్ది రోజులు ప్రేమించుకున్న జంట.. ఎవో మనస్పర్థలు రాగానే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. పెళ్లికి విడాకులు ఎలాగో.. ప్రేమకు బ్రేకప్ అలా అనమాట.  మనకు ఈ వ్యక్తి కరక్ట్ కాదు.. ఇంక ఈ వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండలేము అనే భావన కలిగినప్పుడే బంధం బ్రేకప్ దాకా వెలుతుంది. అయితే.. చాలా మంది తమ లవర్ తో బ్రేకప్ అయిన తర్వాత కొన్ని చెత్త పనులు చేస్తుంటారు. ఆ చెత్త పనులు ఏంటి..? బ్రేకప్ తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

1. ప్రేమలో ఉన్నప్పుడు.. ఒకరి సోషల్ మీడియా అకౌంట్ ని మరొకరు ఫాలో అవుతుండటం కామన్. అయితే.. విడిపోయిన తర్వాత కూడా చాలా మంది తమ మాజీ లవర్ సోషల్ మీడియా యాక్టివిటీస్ ని ఫాలో అవుతుంటారు. ఎక్కడికి వెళ్లారు..? ఎవరితో కలిసి వెళ్లారు..? ఎవరితో కలిసి ఫోటోలు దిగుతున్నారు.. లాంటి విషయాలపై కన్నేసి ఉంచుతారు.  ఈ పనిచేయకూడదంటున్నారు నిపుణులు. వారితో విడిపోయాక.. వాళ్లు ఏం చేస్తే మీకు ఏంటి..? అందుకే ముందుగా వారితో విడిపోగానే సోషల్ మీడియాలో వారిని అన్ ఫ్రెండ్ చేసేయండి, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ లలో అన్ ఫాలో అవ్వాలి.గతంలో వారిని ట్యాగ్ చేస్తూ పెట్టిన ఫోటోలను తొలగించండి.

2. విడిపోయిన తర్వాత చాలా మంది చేసే మరో చెత్త పని ఇది. మీ ఇద్దరికి ఉండే కామన్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వారి గురించి  ఆరా తీయండి లాంటివి చేస్తుంటారు. అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్.

3. మీ పార్టనర్ మీకు బ్రేకప్ చెబితే.. మీ బంధం కొనసాగించడానికి వారిని బ్రతిమిలాడకండి. వారికి మీతో ఉండటం ఇష్టంలేదు అని తెలిసాక కూడా.. మళ్లీ బంధం కొనసాగిద్దామని ఒత్తిడి తేకండి. మీరు చులకన అయిపోతారు.

4.మీకు బ్రేకప్ అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిసేలా చేయడం. దీని వల్ల మీకు కలిగే లాభం ఏమీలేదు. కాబట్టి నార్మల్ గా ఉండటానికి ట్రై చేయండి. మీరు విడిపోయిన విషయం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు.

5.మరికొందరేమో.. విడిపోయిన తర్వాత కూడా వాళ్ల మాజీలకు మెసేజ్ లు, మెయిల్స్ చేస్తుంటారు. అబ్బాయిలు అయితే ఏకంగా తాగేసి ఫోన్లు చేస్తుంటారు. దీనికి బదులు ముందు మీ ఫోన్ నుంచి వారి నెంబర్ ని డిలీట్ చేయండి. మీ మాజీ గురించి చర్చించుకోవడం, ఆలోచించడం లాంటివి చేయండి.

6. చాలా మంది అబ్బాయిలు మద్యానికి బానిసలు అవుతుంటారు. మందు తాగితే.. బాధ మర్చిపోతారనుకోవడం కేవలం అపోహ మాత్రమే. దానికి బదులు మీ కుటుంబసభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించండి.