Asianet News TeluguAsianet News Telugu

జగన్ ‘పాదాభివందనం’ వెనక రహస్యం

 ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి  రామ్ నాథ్  కోవింద్ కు పాదాభివందనం చేయాలని జగన్ కు సలహా ఇచ్చిందెవరు? దాని వెనక మతలబు ఏమిటి?  రామ్ నాథ్ కోవింద్ వయసులో చాలా పెద్ద వాడయినందు ఆయనకు పాదాభివందంన చేశారని అంటున్నారు. వయసులో పెద్దవారయిన సోనియాగాంధీ, ప్రణబ్ ముఖర్జీ, నరేంద్రమోదీలను గతంలో ఆయన కలుసుకున్నపుడు పాదాభివందనం చేసినట్లు లేదు. మరి ఇపుడెందుకు?

the secret of jagan touching the feet of Ram Nath Kovind in Hyderabad

ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఎన్డీయె రాష్ట్ర పతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు పాదాభివందనం చేసి సంచలనం సృష్టించారు. గతవారంలో రాష్ట్రపతిఎన్నికల ప్రచారానికి కోవింద్ ఢిల్లీ వచ్చినపుడు, ఆయనతో వైసిపి నేత , తన ఎమ్మెల్యేలు, ఎంపిలతో కలసి మద్దతు ప్రకటించారు.  ఆ సందర్భంగా జగన్  కోవింద్ కు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఇది ఎవరూ తప్పనడం లేదు. కాని చర్చనీయాంశమయింది.

 

జగన్ కు ఈ సలహా ఎవరచ్చి ఉంటారు?

 

కోవింద్ వయసులో చాలా పెద్ద వాడయినందు ఆయనకు పాదాభివందంన చేశారని అంటున్నారు. గతంలో ఆయన వయసులో పెద్దవారయిన సోనియాగాంధీ, ప్రణబ్ ముఖర్జీ, నరేంద్రమోదీలను కలుసుకున్నపుడు పాదాభివందనం చేసినట్లు లేదు. మరిఇపుడెందుకు?

 

ఎవరికీ తలొగ్గని జగన్ లో మార్పు వచ్చిందనే మెసేజ్ పంపించేందుకు  ఆయన ఎన్నికల కన్సల్టెంటుగా ఉన్న ప్రశాంత్ కిశోర్  ‘పాదాభివందనం’ సలహా  ఇచ్చనిట్లు చాలా మంది  మంది భావిస్తున్నారు. వచ్చే రెండేళ్లో ఇక జగన్ పెద్ద ఎత్తున జనంలో ఉంటారు. పార్టీ సమావేశాాలలో పాల్గొంటారు. అందువల్ల ప్రవర్తన ద్వారా  జగన్ ను స్నేహశీలిగా జనామోదం సంపాదించి పెట్టేందుకు జరగుతున్న ప్రయత్నంలో ఇది భాగమని అంటున్నారు.జాతీయంగా బిజెపికి ఇది ఆయనను బాగా సన్నిహితం కూడా చేస్తుంది.

 

జగన్మోహన్ రెడ్డి దురుసుగా ఉంటారని, ఆయనలో మార్పు రాలేదని, పెద్దలను కూడా గౌరవించరనే ప్రచారం బాగా జరిగింది. వైసిపి నుంచి బయటకెళ్లిన ప్రతినాయకుడు బాగా బురద చల్లారు. దానికి  తోడు కేసుల వ్యవహారం కూడా చూపించి, ఆయన అహంభావి అనే ప్రచారం చేశారు.

 

అందువల్ల ఇదంతా తప్పు, జగన్ పబ్లిక్ ప్రవర్తనే దీనికి సాక్ష్యం అని చెపేందుకు ఇలా చేయించారని అంటున్నారు. జగన్లో  ఇంకా చాలా మార్పులు కనిపిస్తాయని,  మొత్తంగా జగన్ పర్సనాలిటీ  వచ్చెేఎన్నికల నాటికి పూర్తిగా స్నేహపూర్వకంగా  తయారవుతుందని వారు భావిస్తున్నారు.

 

ప్లీనరీ తర్వాత జరిగే కార్యక్రమాలలో కొత్త జగన్ కనిపిస్తాడని, యాత్రలతో, సభలు సమావేశాలతో ఆయన జనం మధ్యనే కాదు, పార్టీలో కూడా తండ్రి రాజశేఖర్ రెడ్డి లాగా తయారువుతారని చెబుతున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios