Asianet News TeluguAsianet News Telugu

జపాన్ లో తొలి  బుల్లెట్ రైలు అలా దూసుకొచ్చింది...

  • భారత్ లో తొలిసారిగా బుల్లెట్ రైలు రాబోతోంది.  
  • జపాన్‌లో మొదటి హైస్పీడ్ రైలు పరిచయం1964 లో జరిగింది.
  • ప్రారంభంలో 515.4 కిలోమీటర్ల పరిధి మేర తోకడో... షిన్ కాన్ సెన్ బుల్లెట్ రైలు పరిచయం అయ్యింది
the relation between The world Bank and Japan Bullet Trains

భారత్ లో తొలిసారిగా బుల్లెట్ రైలు రాబోతోంది.   ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని చేపడుతోంది.  ముంబయి నుంచి అహ్మదాబాద్ మధ్య ఈ 508కిలోమీటర్ల బుల్లెట్ రైలు మార్గం నిర్మాణానికి మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబే తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ బుల్లెట్ రైలుని మన దేశంలో నిర్మించేందుకు భారత ప్రభుత్వం జపాన్ సహాయం తీసుకుంటోంది.

the relation between The world Bank and Japan Bullet Trains

 

బుల్లెట్ రైలు కనుక ప్రారంభమైతే.. అభివృద్ధి పరంగా మన దేశం ఒక మెట్టు పైకి ఎక్కినట్టు అవుతుంది. మన దేశంలో తాజాగా..ఈ బుల్లెట్ రైలుని ప్రవేశపెడున్నాం. కానీ.. మనకు ఈ బుల్లెట్ రైలు నిర్మాణానికి సహకరిస్తున్న జపాన్ దేశం మాత్రం.. కొన్ని పదుల సంవత్సరాల క్రితమే.. ఈ అభివృద్ధిని సాధించేసింది. 1961లోనే అక్కడ బుల్లెట్ రైలు నిర్మాణానికి అంకురం పడింది. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన జపాన్ దేశం..రైల్వేల్లో తీసుకువచ్చిన మార్పులు చేస్తూ ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వారి రైల్వే వ్యవస్థని ఒకసారి పరిశీలిస్తే..

జపాన్‌లో మొదటి హైస్పీడ్ రైలు పరిచయం1964 లో జరిగింది. ప్రారంభంలో 515.4 కిలోమీటర్ల పరిధి మేర తోకడో... షిన్ కాన్ సెన్ బుల్లెట్ రైలు పరిచయం అయ్యింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సుమరుగా 2,387.7 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైళ్ల నెట్‌వర్క్ విస్తరించింది. షిన్ కాన్ సెన్ అనగా బుజు మార్గం అని అర్థం. ప్రస్తుతం జపాన్‌లో ఈ పదానికి సరిపోయే విధంగా ఎన్నో బుల్లెట్ రైళ్ల మార్గాలు ఉన్నాయి. అత్యంత రద్దీతో కూడుకున్న హై స్పీడ్ బుల్లెట్ రైలు మార్గాలకు ఇక్కడ కొదవే లేదు. జపాన్ బుల్లెట్ రైళ్లలో 10 మిలియన్ ప్రయాణికుల తాకిడి ఉంది. ఇందులో టొకైడో శింకాన్సెన్ నెట్‌వర్క్ వారికి యాత్రికుల ద్వారా 5 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం చేకూరుతోంది.

ఇది జపాన్ లో ప్రస్తుతం ఉన్న రైళ్ల వ్యవస్థ. అయితే.. అనున్నంత సులభంగా జపాన్ ఈ అభివృద్ధిని సాధించలేదు. అందుకు చాలానే కష్టపడింది. 1872లో జపాన్ లో మొదటి రైల్వే వ్యవస్థ ఏర్పడింది.  టోక్యో నుంచి యొకోహోమాకు 29కిలోమీటర్ల దూరం వరకు ఈ రైల్వే లైన్ ఉండేది. తర్వాత దానిని అప్పటి జపాన్ ప్రభుత్వం 1881 వ సంవత్సరం కల్లా 135 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అంతకన్నా ఎక్కువ మేర రైల్వే వ్యవస్థను విస్తరించాలని ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. వారి దగ్గర నిధులు సరిపడా లేవు. దీంతో.. ప్రైవేటు సంస్థలను ఈ రంగంలోని ఆహ్వానించాయి. వారిని ఆహ్వానించిన 9 సంవత్సరాల తర్వాత జపాన్ దేశంలో 885కిలోమీటర్ల రైల్వే లైన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. 2,124కిలోమీటర్ల రైల్వే లైన్ ప్రైవేటు సంస్థలు వేశాయి.

the relation between The world Bank and Japan Bullet Trains

1906లో ఎక్కువ దూరం ప్రయాణించే రైల్వే లైన్లను ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. లోకల్ లో ప్రయాణించే వాటిని మాత్రం ప్రైవేటు సంస్థలే నిర్వహించాయి. 1907 నాటికి 6,407కిలోమీటర్ల రైల్వే లైన్లు ప్రభుత్వం చేతిలోకి వచ్చాయి.

1961లో తొలిసారిగా జపాన్ లో బుల్లెట్ రైలు నిర్మాణానికి అంకురం పడింది. ప్రపంచంలో తొలిసారిగా అత్యంత వేగవంతంగా నడిచే రైలును ప్రవేశపెట్టాలని వారు యోచించారు. ఇందుకోసం వారు ప్రపంచ బ్యాంకు నుంచి దాదాపు 80మిలియన్ డాలర్లు అప్పుగా తీసుకున్నారు. ఆ నగదు సహాయంతో టోక్యో, యోకోహోమో, నాగోయా, క్యోటో ప్రాంతాలకు అంత్యంత వేగవంతమైన రైల్వే పనులను ప్రారంభించి 1964లో పూర్తి చేశారు. తోకడో... జపాన్ దేశానికి ఇండస్ట్రీయల్ హార్ట్ లాంటిది. అందుకే ఆ ప్రాంతానికి అనుసంధానం చేసేలా మొదటి బుల్లెట్ రైలును ఏర్పాటు చేశారు.

దీనిలో మొత్తం 186మంది ప్రయాణికులు ప్రయాణించేలా దీనిని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిఫైడ్ సిస్టమ్ తో దీనిని తయారు చేశారు. మొత్తం 80 టన్నెల్స్ తో ఈ ప్రాజెక్టును వారు పూర్తి చేశారు. ఈ రైళ్లను టోక్యోలోని సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ కంట్రోల్ చేసేది. ఇక్కడి నుంచి రైల్వే టెలిఫోన్ తో రైల్వే ఇంజినీర్లతో అధికారులు మాట్లాడేవారు.

తర్వాత ప్రత్యేకంగా పాసింజర్ల కోసం పాసింజర్ రైలును ప్రవేశపెట్టారు. తొలి రోజుల్లో 16 యూనిట్లను ప్రవేశపెట్టి ఒకే సారి 1250మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. ఆ రైలు టోక్యో నుంచి ఒసాకా ప్రాంతానికి ఉదయం 6గంటల నుంచి ప్రతి అరగంటకు ఒక రైలును నడిపారు. వీటిలో సగం రైళ్లు.. సూపర్ ఎక్స్ ప్రెస్ వే. కేవలం రెండే రెండు స్టాప్స్ లో ఆగుతూ అవి గమ్యస్థానానికి వేగంగా చేరిపోతాయి.

ఇలా రైల్వే వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు జపాన్ ప్రభుత్వం 1953 నుంచి 1966 వరకు ప్రపంచ బ్యాంక్ నుంచి 31సార్లు లోన్ తీసుకుంది. మొత్తం ఈ రైల్వే నిర్మాణాల ఏర్పాటుకు జపాన్ ప్రభుత్వం 862 మిలియన్ డాలర్ల నగదును ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా తీసుకుంది. 1966లో అప్పు తీసుకోవడం జపాన్ ఆపేసింది.

దీనిపై ఎస్ఏఆర్ వైస్ ప్రెసిడెంట్ మైకు నిషిమైజు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. తాము అన్ని ప్రాజెక్టులను వరల్డ్ బ్యాంక్ సహాయంతోనే పూర్తి చేయగలిగామని తెలిపారు.  ఈ ప్రాజెక్టు గురించి ఎలా ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానికి అయ్యే ఖర్చు, రేషనల్ ప్రాజెక్టు ఎనాలసిస్.. ఇలా ప్రతివిషయం తాము వరల్డ్ బ్యాంక్ ఇంజినీర్ల నుంచి తెలుసుకోగలిగామన్నారు. రైలు టిక్కెట్ ధర ఎంత ఉండాలనే విషయం దగ్గర నుంచి ప్రతి విషయం వారి నుంచి నేర్చకున్నామని ఆయన వివరించారు. ఈ విధంగా జపాన్.. వరల్డ్ బ్యాంక్ సహాయసహకారాలతో ప్రపంచంలోనే అత్యత్తుమమైన రైల్వే వ్యవస్థను మెరుగుపరిచింది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios