సైరా నుంచి రెహమాన్ తప్పుకోవడానికి కారణం ఇదే..

the reason behind AR Rahman To Walk Out Of Sye Raa
Highlights

  • చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా
  • సైరా నుంచి తప్పుకున్న రెహమాన్
  • తప్పుకోవడానికి గల కారణాన్ని వివరించిన రెహమాన్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ సైరా’. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది కూడా. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని మూడు భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. అందుకు తగట్టుగానే.. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చే బాధ్యతను రెహమాన్ చేతిలో పెట్టారు. అయితే.. అనూహ్యంగా ఈ చిత్రం నుంచి రెహమాన్ తప్పుకున్నాడు.

రెహమాన్ ప్రకటనతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఎందుకు తప్పుకున్నారనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే.. తాజాగా దీనిపై రెహమాన్ స్పందించారు. ఇటీవల హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో రెహమాన్ ప్రత్యేక మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ సైరా సినిమా గురించి ప్రస్తావించారు. చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్నందుకు తనకు చాలా బాధగా ఉందని ఆయన విచారం వ్యక్తం చేశారు. కొన్ని కారణాల వల్ల తాను సినిమా నుంచి తప్పుకున్నానని ఆయన చెప్పారు.

అయితే.. రెహమాన్ ఈ సినిమా నుంచి  తప్పుకోలేదని.. చిరంజీవే తప్పించాడంటూ ఫిలింనగర్ లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమా కోసం రెహమాన్ ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేశాడని.. అందుకే ఆయనను తప్పించినట్లు సమాచారం. ఇప్పుడు రెహమాన్ స్థానంలో మరో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సెలక్ట్ చేయాలని చిరంజీవీ అండ్ కో ట్రై చేస్తున్నారు. అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాత్రం తమన్  అయితే బాగుటుందని భావిస్తున్నారట.

loader