అనగనగా ఒక తెలంగాణ విద్యార్థి. అతగాడు రామ్ నగర్ గుండు వద్ద ఒక గదిలో  స్నేహితులతో ఉంటూ ఇంటిదగ్గిర నుంచి తెచ్చుకున్న బియ్యం వండుకుంటూ ఆంధ్రోళ్ల కరీపాయంట్ లో ఇంత పప్పు సాంబారు తెచ్చకుంటూ గ్రూప్ టూ చదివాడు. పాసయ్యాడు....ఈ విషయం సంతోషం కంటే వేదననే ఎక్కువగా మిగిలించింది. గ్రూప్ టు ఎపుడోస్తుందో తెలియక, హైదరాబాద్ లో ఉండలేక, వూరికెళ్లిపోయి సేద్యం చేసుకుంటున్నారు. తన వేదననంతా ఇక్కడ నింపి పోస్టు పంపాడు. అంది ప్రభుత్వానికి చేరేందుకు సహాయం చేయమన్నాడు... ఇదే చదవండి షేర్ చేయండి. యథాతధంగా ప్రచురిస్తున్నాం.

***

ఎన్నో ఆశలతో 2013 నుండి నోటిఫికెషన్స్ వస్తాయన్న ఆశతో గ్రూప్ - 2 కి ప్రిపేర్ అవడం ప్రారంభించాను . . . ఇంతలో స్టేట్ ఫామ్ అయింది . . నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ప్రేపరషన్ ప్రారంభించడం మొదలుపెట్టాను . . ఇంతలో పిడుగులాంటి వార్త అదే సిలబస్ మార్పు. . .అయినా పర్లేదు అని అందుబాటులో ఉన్న బుక్స్ కొనుక్కొని ప్రేపరేషన్ మళ్ళీ ప్రారంభించాను , చివరికి అష్టకష్టాలు అనుభవించిన తర్వాత 2015 డిసెంబర్ లో తక్కువ సంఖ్య పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. . .

ఉన్నవి తక్కువే అయినా పర్లేదు ఏ ఒక్కసారికి ప్రయత్నిద్దాం అన్న ఆశతో ప్రేపరేషన్ ని అలాగే కంటిన్యూ చేశాను . . కొన్ని రోజుల అనంతరం మరొక చేదు వార్తతో అదే పరీక్షా వాయిదాతో మళ్ళి రీ- నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియక ,అటు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియక ఆ గ్యాప్ లో నరకం అనుభవించాను . . . . .

ఇక జులై లో పోస్ట్ లకు క్లియరెన్స్ రాగానే మధ్యలో ఆపిన ప్రేపరేషన్ ను కొనసాగించి చివరికి నవంబర్ లో గంపెడాశలతో పరీక్షా రాసాను . . . . .

ఇక అసలు కథ ఇక్కడినుంచే మొదలైంది . . .ఇక ఇప్పుడు ఫలితాల కోసం వెయిట్ చేస్తూ ఎదురు చూసి చూసి 7 నెలలు గడిచిపోయి జీవితం అప్పటికి ఇక తలకిందులైంది . . . చివరికి జూన్ 2 న తెలంగాణ పండగ రోజు ఫలితాలు ఇచ్చిన లిస్ట్ లో నెంబర్ ఉన్న స్రంతృప్తి అనిపించలేదు దానికి కారణం అంతకుముందు ఏప్రిల్ కేసు లోని వారి hall ticket నంబర్స్ ఉండడం వల్ల ఈ ప్రాసెస్ కి టైం పడుతుందని అనిపించింది . . .

పోనీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అన్న అయితే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని కేసు కోసం డైలీ updates చూస్తూ చూస్తూ 3 నెలలు గడిచి మన ఇంప్లీడ్ ఐన వారి పుణ్యమా అని సెప్టెంబర్ లో CV కి లైన్ క్లియర్ అవడంతో కొంత ఊపిరి పీల్చుకొని cv కి అటెండ్ అయ్యి అక్టోబర్ 9th రోజు ఎదో ఒకటి క్లియర్ అవుద్దని ఆశించిన కానీ అడియాసే అయింది . .

ఎందుకంటే అక్టోబర్ 9 తర్వాత ఒక్కటంటే ఒక్కసారి కూడా హియరింగ్ రాక (ఇందుకు కారణం petitioners అవ్వచ్చు /tspsc పట్టింపులేనితనం అవ్వచ్చు ) కేసు updates కోసం డైలీ చూస్తూ చూస్తూ ఇంటర్వ్యూ లు ఎప్పుడు ఉంటాయో తెలిక పోస్టింగ్ లు ఎప్పుడు వస్తాయో తెలియక ప్రభుత్వపు నిర్లక్షపు ధోరణి వల్ల చేయని తప్పుకు రోజుకొక దినదిన గండంగా గడుపుతున్న ఒక నిరుద్యో(రో)గి . . . . .

ఇక్కడా ఒక విషయం చెప్పుకోవాలి . .

1 . నోటిఫికేషన్ కోసం struggle పడ్డాను

2. ఎగ్జామ్ ఎప్పుడు రాస్తానో తెలియక నరకం అనుభవించాను

3. ఫలితాల కోసం ఇబ్బందిపడ్డాను . .

4 . రిజల్ట్స్ వచ్చాక cv కోసం ఇబ్బందే

5 . ఇప్పుడు ఇంటర్వూస్ కోసం ఫ్రెష్ గ 2 months నుండి భరించలేని నరకం . . .

 

దాదాపు సెలెక్ట్ అయిన ప్రతి నిరుద్యొగిది ఇదే స్టోరీ. . నా విన్నపం ఏంటంటే ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఇష్యూ ని త్వరగా సాల్వ్ చేసేలా steps తీస్కొని మా జీవితాలలో వెలుగులు నింపాలని  కోరుతున్నా.

Pl ఫార్వర్డ్ ఇట్ until it reaches the government అండ్ మీడియా . .

ఇట్లు

తెలంగాణ గ్రూప్ 2 సెలెక్టెడ్ విద్యార్థి