ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ నోకియా.. భారత మార్కెట్లోకి మరో చౌక స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లోనే నోకియా.. ‘‘నోకియా1’’ పేరిట బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.

దీనిలో ఆండ్రాయిడ్ 8.0 ఓరియో గో ఎడిషన్ ను అందిస్తున్నారు. దీని ధర రూ.5,500గా ప్రకటించారు. ఏప్రిల్ నుంచి ఈఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ కలర్స్ లో లభ్యమౌతున్నాయి.
 

నోకియా 1 ఫోన్ ఫీచర్లు...

4.5 ఇంచెస్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2150 ఎంఏహెచ్ బ్యాటరీ.