ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్.. త్వరలో భారత మార్కెట్లోకి మరో కొత్త మోడల్ ఫోన్ ని విడుదల చేయనుంది. యాపిల్ సంస్థకి చెందిన ఐఫోన్ మోడల్స్ లో కేవలం ఎస్ఈ మాత్రమే ధర తక్కువ అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. దీనిని భారత్ లోనే తయారు చేస్తారు. కాగా.. దీని కొనసాగింపుగా.. మరో మోడల్ ని ప్రవేశపెడుతున్నారు.

ఐఫోన్ ఎస్ఈ 2 పేరిట దీనిని మొదట యాపిల్ డబ్ల్యూడబ్ల్యూసీసీ( వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్) లో ప్రదర్శించనున్నారు. ఇందులో ప్రదర్శించిన నెల రోజులకి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఐఫోన్ ఎస్ఈ మాదిరిగానే దీని ధర కూడా తక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లో ఐఫోన్ ఎక్స్ లో మాదిరిగా ఓలెడ్ డిస్ ప్లేను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఎస్ఈ మోడల్ డిస్ ప్లే 4 ఇంచెస్ కాగా.. దీని డిస్ ప్లే 4.2 ఇంచెస్ ఉంటుందని సమాచారం.