Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్, యుపిఎ చాలా కాలం మర్చిపోయిన తేదీ

  • కార్గిల్ విజయాన్ని కీర్తిస్తే, కార్గిల్ విజయ దినోత్సవం జాతీయ సంబరమయితే, ఇందిరాగాంధీ, ఆమె జరిపిన 1971యుద్ధం మరుగున పడతాయని కాంగ్రెస్ భయం
  •  అనేక పర్యాయాలు గుర్తు చేశాక ..2009లో అప్పటికి రక్షణ మంత్రి ఎకె అంటోని కార్గిల్ విజయ్ దివస్ పాటిస్తామని ప్రకటించారు
the date the congress forgot for years

 

జూలై 26,1999

ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని  యుపిఎ ప్రభుత్వం చాలా కాలం మర్చిపోయిన తేదీ.
ఈ తేదీని అంతసులభంగా మర్చిపోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, భారతీయులందరిలో భావోద్వేగం, దేశభక్తి రేకెత్తించే తేదీ అది.  అయినా కాంగ్రెస్ మర్చిపోయింది. ఆతేదీ విశేషం ఎమిటో తెలుసా... 1999లో భారత సరిహద్దులోని కార్గిల్, ద్రాస్ ప్రాంతాలను ఆక్రమించిన పాకిస్థాన్‌కు కదన రంగంలో తగిన బుద్ధి చెప్పి కార్గిల్‌లో భారతీయ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన రోజు.


దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దులో భారత సైన్యం పహారా కాస్తోంది.. పగలు, రాత్రి తేడా లేకుండా.. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా.. అవసరమైతే ప్రాణాలను ఎదురొడ్డి విరోచిత పోరాటం చేస్తోంది. దీనికి గుర్తుగా యేటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించతల పెట్టి నేటికి 18 సంవత్సరాలు. అయితే, 2004-2009 మధ్య యుపిఎ ప్రభుత్వం విజయ్ దివస్ ను జరపనే లేదు. అనేక సార్లు రాజ్యసభ ఎంపి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశాక, 2009లో అప్పటికి రక్షణ మంత్రి ఎకె అంటోని కార్గిల్ విజయ్ దివస్ పాటిస్తామని ప్రకటించారు. ఇండియా గేట్ దగ్గిర అమరవీరులకు పుష్పాంజలి ఘటిస్తామని చెప్పారు.


దీనికి కారణం తెలుసా?
కార్గిల్ విజయాన్ని కీర్తిస్తే, కార్గిల్ విజయ దినోత్సవం జాతీయ సంబరమయితే, ఇందిరాగాంధీ, ఆమె జరిపిన 1971యుద్ధం మరుగున పడతాయని కాంగ్రెస్ భయం.
1999 జూలై 26న దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతేకాక యుద్ధరంగంలో తమ భర్త, కొడుకు, అన్న, తమ్ముళ్లను కోల్పోయిన కుటుంబాలను గుర్తు చేసుకోవాలిసిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు వాళ్లే కారణం. నేడు ప్రశాంతంగా గడిచి రేపటి రోజును చూస్తున్నామంటే అందుకు కారణం కూడా భారత సైనికులే.

ఇపుడు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన దీనీని ఘనంగా నిర్వహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios