చిన్నారిపై సవతి తల్లి ప్రతాపం

First Published 5, Dec 2017, 12:08 PM IST
The child tortured by the stepmother
Highlights
  • చండీఘడ్ లో దారుణం
  • చిన్నారిని చిత్రహింసలకు గురిచేసిన సవతి తల్లి
  • అరెస్ట్ చేసిన పోలీసులు

ఆ చిన్నారుల తల్లి చనిపోయింది. దీంతో తండ్రి పిల్లల బాగోగులు చూసుకోడానికి మరో మహిళను విహాహం చేసుకున్నాడు. ఆ సవతి తల్లి పిల్లలకు ప్రేమ గా చూసుకోవడం అటుంచి వారిపై దాష్టికానికి దిగింది. అయితే ఈ చిన్నారులను చితకబాదుతున్న వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ సవతి తల్లి కటకటాలపాలయ్యింది.

వివరాల్లోకి వెళితే చండీఘడ్ కు చెందిన చిన్నారుల తల్లి క్యాన్సర్ తో రెండేళ్ల క్రితం చనిపోయింది. దీంతో ఆ పాప తండ్రి మరో మహిళను విహాహం చేసుకున్నాడు. అయితే అతడు బయటకు వెళ్లిన సమయంలో ఈ సవతి తల్లి చిన్నారులను చితకబాదేది. మళ్లీ అతడు రాగానే తనకు ఏం తెలీదన్నట్లుగా ప్రేమగా ఉండేది. ఈ విషయం తండ్రికి చెప్పొద్దని చిన్నారిని భయపెట్టేది.

ఈ సవతి తల్లి ఈ చిన్నారిని ఇటీవల సంచిలో కుక్కి ఊపిరాడకుండా చిత్రహింసలకు గురిచేసింది. అలాగే సంచిలో ఉండగా చిన్నారిని కొడుతూ, జుట్టు పట్టి బయటకు లాగి చెవులు పిండుతూ కర్కషంగా ప్రవర్తించింది. చిన్నారి పాప బాధతో ఏడుస్తున్నా కాస్తైనా కనికరం చూపించలేదు. ఈ సవతి తల్లి చిన్నారికి పెడుతున్న చిత్రహింసలను పాప సోదరుడు సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.  ముక్కుపచ్చలారని చిన్నారి దారుణంగా కొడుతున్న వీడియోను చూసి నెటిజన్లు ఈ సవతి తల్లిపై తీవ్రంగా మండిపడుతున్నారు. 

పాపను చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలుసుకున్న తండ్రి ఈ కసాయి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్‌ చేశారు.  

loader