తిరుమలలో పసిపిల్లవాడి కిడ్నాప్ జరగడంతో సంచలనం సృష్టించింది.తమిళనాడు వ్యాప్తంగా అన్ని పత్రికలు, టివి లలో కూడా ఈ వార్త ప్రముఖంగా వచ్చింది.దీనితో భయపడ్డ కిడ్నాపర్లు స్వయంగా తమిళనాడు లోని నమ్మకల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.
ఆ మధ్య తిరుమలలో కిడ్నాపైన చిన్నా రి చెన్నకేశవులు దొరికాడు. ఆచూకీ లభ్య కాగానే పోలీసుల కిడ్నాపర్ల అరెస్టు చేసి బాలుడిని కాపాడారు.
తమిళనాడు లోని నమక్కల్ లో కిడ్నాపర్లు ఇపుడు తమిళనాడు పోలీసులు అదుపులో ఉన్నారని సమాచారం అందింది.
జూన్ 14 తిరుమల శ్రీవారి సన్నిధిలో ఒక కుటుంబం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వారి బాబుని కిడ్నాపర్లు ఎత్తుకుపోయారు.
తిరుమలలో ఇలాంటి ఘోరం జరగడంతో ఈ వార్త సంచలనం సృష్టించింది.
తమిళనాడు వ్యాప్తంగా అన్ని పత్రికలు, టివి లలో కూడా ఈ వార్త ప్రముఖంగా వచ్చింది.
దీనితో భయపడ్డ కిడ్నాపర్లు స్వయంగా తమిళనాడు లోని నమ్మకల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.
పిల్లలు లేరనే చెన్నకేశవులను ఎత్తుకెళ్ళినట్లు పోలీసుల విచారణలో కిడ్నాపర్లు వెల్లడించారు.
సాయంత్రానికి చెన్నకేశవులుతిరుపతికి చేరుకునే అవకాశం ఉంది.
