2017 లో  అత్యంత జనాదరణ పొందిన వీడియోల జాబితాను యూట్యూబ్ రీలీజ్ చేసింది. వాచింగ్‌, షేరింగ్‌, కామెంట్లు, లైక్స్ అధారంగా ఈ ఎంపిక  జరిగింది. దీని ప్రకారం "ది మాస్క్ సింగర్"  అనే వీడియో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.చిత్రమేమిటంటే ఇది అమెరికా ప్రొడక్షన్ కాదు. నాన్ అమెరికన్ వీడియో కి ఈ గౌరవం దక్కడం విశేషం. ఇది థాయ్‌లాండ్‌ పాటలపోటీ కి సంబంధించిన క్లిప్. ఇందులో ఒక మనిషి ఆయస్టర్ సూట్ వేసుకుని  "లవ్ యు అంటిల్ ది వర్లడ్ టర్న్స్ ఇంటు డస్ట్’’ పాడతాడు.

ధాయ్ లాండ్ పోటీ చిత్రంగా ఉంటుంది. ఇందులో పార్టిసిపేంట్స్ తమ ఐడెంటిటి కనిపించకుండా నిండుగా దుస్తులు,  వివిధ ఆకారాలలో అలంకారాలువేసుకుని ఫర్ ఫాం చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతి  మొదట కొరియాలో  మొదలై ధాయ్ లాండ్ కు విస్తరించింది. 2017లో మొత్తంగా ఈ క్లిప్ ని 3 బిలియన్ లసార్లు తిలకించారు. అంతేకాదు, యుట్యూట్ లో ఒక థాయ్ వీడియో క్లిప్ ఇలా నెంబర్ వన్ ర్యాంకు కొట్టడం ఇదే మొదటిసారి.