Asianet News TeluguAsianet News Telugu

నరాలు తెగే ఉత్కంఠ

భారత్ జట్టులోని ఆటగాళ్ళందరూ సమతూకంగానే ఉన్నారు. కాకపోతే బౌలింగ్ మరికాస్త బలోపేతమవ్వాలి. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, యువరాజ్ సింగ్, ధోని ఇలా..అందరూ మంచి ఊపుమీదున్నారు. బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, భువనేశ్వర్, అశ్విన్, కేదార్ పాండే పర్వాలేదనిపిస్తున్నారు.

Tension mounting over India pak championship cricket final

నరాలు తెగిపోతున్నాయి. దేశమంతా ఫీవర్ తో ఊగిపోతోంది. అదే భారత్-పాకిస్ధాన్ క్రికెట్ మ్యాచ్. మరికొద్ది గంటల్లో ఐసిసి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్. టోర్నమెంట్ ఏదైనా కానీ ఒకసారి రెండు దేశాల జట్ల మధ్య మ్యాచ్ అంటేనే ఇరుదేశాల్లోనూ తీవ్ర ఉత్కంఠ మొదలవుతుంది. అటువంటిది రెండు సార్లు అందులోనూ ప్రతిష్టాత్మకమైన కప్ ఫైనల్ అంటే ఇక చెప్పేదేముంది? ఈరోజు అదే జరగబోతోంది.

ఏ దేశంలోని అభిమానాలైనా పోటీలో తమ జట్లే గెలవాలని అనుకోవటం సహజం.  అందుకు ఈ రెండు దేశాల్లోని అభిమానులూ అతీతం కాదు. కాకపోతే మిగిలిన దేశాల్లో క్రికెట్ ను కేవలం ఓ ఆటలాగే ఆస్వాదిస్తారు. ఈరెండు దేశాల్లో మాత్రం క్రికెట్ ఆట లాగ కాకుండా ఓ మతంలాగ తయారైంది. అందుకే అంతటి ఉద్రేకం, ఉత్కంఠ.

ఐసిపి ఛాంపియన్ షిప్ లో రెండు జట్లూ ఒకసారి ఓడిపోయాయి. అయినా మళ్ళీ పుంజుకున్నాయి. దాంతో రెండు జట్లలోని ఆటగాళ్లు ఇపుడు ఫుల్ ఫాంలో ఉన్నారు. జట్ల బలాబలాలు చూస్తే భారత్ కన్నా పాకిస్ధాన్ వెనకే ఉంటుంది. కాకపోతే క్రికెట్ ఆట అన్నది అనిశ్చితికి మారుపేరు. ఏ ఆటగాడు ఏరోజు ఎలా ఆడుతాడో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకూ అదరగొట్టేసిన బ్యాట్స్ మెన్ ప్రధానమ్యాచ్ లో సున్నాకే అవుటైపోవచ్చు. అంతవరకూ పెద్దగా ప్రభావం చూపని ఆటగాడు రెచ్చిపోవచ్చు.

ఇక, భారత్ జట్టులోని ఆటగాళ్ళందరూ సమతూకంగానే ఉన్నారు. కాకపోతే బౌలింగ్ మరికాస్త బలోపేతమవ్వాలి. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, యువరాజ్ సింగ్, ధోని ఇలా..అందరూ మంచి ఊపుమీదున్నారు. బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, భువనేశ్వర్, అశ్విన్, కేదార్ పాండే పర్వాలేదనిపిస్తున్నారు.

బ్రహ్మాండమైన జట్లనుకున్న ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిల్యాండ్, ఇంగ్లాండ్ జట్లు ఇంటిదారి పట్టటం పలువురిని ఆశ్చర్యపరిచాయి. అందుకే క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేరు. ఇక, ఫైనల్లో భారత్ గెలవాలని దేశంలోని అనేక చోట్ల ప్రత్యేకపూజలు కూడా జరుగుతుండటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios