Asianet News TeluguAsianet News Telugu

కర్నాటకలో తెలుగు విద్యార్థుల మీద దాడి

దీనితో పలుచోట్ల పరీక్షల రద్దుచేయాల్సి వచ్చింది.

telugu students attacked in karnataka

 నీళ్ల కొరత లాగా ఉద్యోగాల కొరత వల్ల రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత ఏర్పడుతూ ఉంది.  ఉన్న కొద్ది ఉద్యోగాలు స్థానికుల పేరుతో ఆయా రాష్ట్రాల వాళ్లు పొందాలనుకోవడం, దీనితో  పొరుగు రాష్ట్రాల నుంచి పోటీ పరీక్షలు రాసే వారిని అడ్డుకోవడం జరుగుతూ ఉంది.  గతంలో ఒరిస్సాలో  ఉత్తరాంధ్ర తెలుగు విద్యార్థులకు ఈ పరిస్థితి చాలాసార్లు ఎదురయింది. విశాఖ రైల్వే జోన్ డిమాండ్ వెనక ఈ టెన్షన్ కూడా ఉంది. ఇపుడు తాజాగా ఈ ఉద్రిక్త పరిస్థితి తెలుగు,కన్నడిగుల మధ్య మొదలయింది. కర్ణాటకలో ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులను కన్నడిగులు అడ్డుకుంటున్కనారు. శనివారం  ఈ పరీక్షలు రాసేందుకు కర్నాటక పట్టణాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారున  పరీక్షా కేంద్రాల దగ్గిర ఆందోళన నెలకొంది. కర్నాటక రీజయిన్  లోని తమ ఉద్యోగాలను తెలుగు విద్యార్థులు కొల్లగొడుతున్నారని కన్నడ సంఘాల వారు ఆరోపిస్తున్నారు. పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై  వారు దాడి చేశాతెలుగు విద్యార్థును అడ్డుకున్నాయి.  కన్నడిగుల తమ పట్ల ఇలావ్యతిరేకత చూపడటం పట్ల  తెలుగు విద్యార్థులు హుబ్లీలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పరిస్థితి పరీక్షను రద్దు చేశేదాకా వెళ్లింది. హుబ్లీతో పాటు గుల్బర్గా, దావణగెరె, బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆంధ్రా కాంగ్రెస్ ఖండన

కర్నాటకలో  రైల్వే, బ్యాంకు ఉద్యోగ   పరీక్షలకు  వెళ్లిన తెలుగు విద్యార్థులపై కన్నడిగులు దాడులు చేయడం అమానుష చర్యఅని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజి వ్యాఖ్యానించారున 
విద్య, ఉద్యోగాల కోసం జా తీయ స్థాయిలో ఎక్కడ పోటీ  పరీక్షలు  నిర్వహించినా హాజరయ్యే హక్కు భారతీయులందరికీ ఉంటుందన్న సత్యాన్ని కన్నడిగులు గ్రహించాలనిఅంటూ దాడిని ఖండించారు.
దేశ సమైక్యతను విచ్ఛిన్నం చేసే ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా కర్నాటక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 
-దాడి  ఘటనలపై  తెలుగు రాష్ట్రాల   ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు  వెంటనే  కర్నాటక సీఎంతో మాట్లాడి తెలుగు విద్యార్థులకు  హాని కలగకుండా తగిన రక్షణ కల్పించాలని కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios