ప్రపంచ ఫొటోగ్రఫీ ' ది హ్యుమానిటీ ఫొటో అవార్డు’కి  తెలుగోడు ఎంపికయ్యాడు. విజయవాడకు ‘ది హిందూ’ సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ సిహెచ్‌విఎస్‌ విజయభాస్కరరావు పోర్ట్రైట్, కాస్ట్యూమ్స్‌ అన్న అంశంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు.అవార్డు సంపాదించి పెట్టిన చిత్రాలు తెలంగాణా లంబాడా జీవన శైలికి సంబంధించినవి.

ప్రపంచ ఫొటోగ్రఫీ ' ది హ్యుమానిటీ ఫొటో అవార్డు’కి తెలుగోడు ఎంపికయ్యాడు. విజయవాడకు ‘ది హిందూ’ సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ సిహెచ్‌విఎస్‌ విజయభాస్కరరావు పోర్ట్రైట్, కాస్ట్యూమ్స్‌ అన్న అంశంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

సెప్టెంబరు 16న బీజింగ్‌లో ఈ అవార్డును ఆయన స్వీకరిస్తారు. . నిజామాబాద్‌ జిల్లా ఖైతా లంబాడీల జీవనశైలికి సంబంధించి ఆయన తీసిని ఉత్తమ ఛాయా చిత్రాలకు అవార్డు లభించింది.

భాస్కర్ రావు మూడు దశాబ్దాలుగా ఫొటోగ్రాఫర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో యునెస్కో అవార్డుతో పాటు బ్రిటిష్‌ రాయల్‌ ఫొటోగ్రఫీ సొసైటి నుండి అసోసియేట్‌షిప్‌ గౌరవాన్ని కూడా పొందారు. చైనా పోక్ లోర్‌ ఫొటోగ్రాఫిక్‌ అసోసియేషన్‌ (సిఎఫ్‌పిఎ), ది యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) కలిసి సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 18 మంది ఎంపిక కాగా వీరిలో విజయభాస్కరరావు భారత దేశం నుంచి ఎంపిక ఏకైక కళాకారుడు.

133 దేశాల నుంచి 6387 ఫొటోగ్రాఫర్లు 7848 డాక్యుమెంటరీ ఛాయా చిత్రాలను పోటీకి పంపారు.

65 సంవత్సరాలుగా ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రపంచంలోని ఫోటోగ్రాఫర్లంతా పోటీ పడుతూ ఉంటారు.