ఎల్ రమణ సీరియస్, ముఖ్యమంత్రి కెసిఆర్ కు పది ప్రశ్నలు

ఎల్ రమణ సీరియస్, ముఖ్యమంత్రి కెసిఆర్ కు పది ప్రశ్నలు

తెలంగాణ ప్రభుత్వం దృష్టి బిసిల మీదికి మళ్లించింది. ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం కూడా ఏర్పాటుచేసింది. ఒక నాలుగయిదు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెనకబడిన వర్గాలపై చాలా అభిమానం చూపిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 42 నెలలు గడిచాక ముఖ్యమంత్రి ఇలా బిసి మంత్రం జపించడం కొతగాను, వింతగాను కొత్తగాను ఉందని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు, వెనకబడిన తరగతినాయకుడు ఎల్ రమణ అంటున్నారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన గౌరవం కూడా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో బిసిలకు దొరకడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఇదంతా మోసమంటున్నారు. కేవలం వోట్ల కోసం ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకమని విమర్శిస్తున్నారు. బిసిల పట్ల, బలహీన వర్గాల పట్ల తనకున్న నిజాయితీని నిరూపించేందుకు ముఖ్యమంత్రి తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రమణ అంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ముఖ్యమంత్రికి వేసిన ప్రశ్నలివే:

 1. రాబోయే 18 నెలలకు టీఆర్ఎస్ అద్యక్ష, సీఎం పదవిని బలహీనవర్గాలకు ఇస్తారా ?
 2. కేసీఆర్ సలహాదారుల్లో బీసీలు ఉన్న బిసిలు ఎందరు ?
 3. సీఎం కార్యాలయంలో కూడా ఒక బిసి అధికారి కూడా లేరు, ఎందుకు?
 4. టీఆర్ఎస్ 42 నెలల పాలనలో డిజిపి, ప్రిన్సిపల్ సెక్రటరీలు జిల్లా అధికారుల నియామకాల్లో బిసిలకు ఏ  ప్రాధాన్యతనిచ్చారో చెప్పాలి.
 5. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్ లలో రూ.4 లక్షల 50 వేల కోట్లను కేటాయించారు. ఇందులో బిసిల  వాటా ఎంత, చేసిన ఖర్చు ఎంత?
 6. గత 42 నెలలుగా ఇష్టానుసారం పాలన చేసి, టిఆర్ఎస్ పెద్దల పబ్బం గడుపుకుని  బిసిలకు ఏంకావాలో మీరే చెప్పండని వాటిని తప్పకుండా అమలు చేస్తానని  కేసీఆర్ కొత్త నాటకమా కాదా?
 7. మీరు బిసి ల సమావేశం  వోట్ల రాజకీయం కాదా? కాకపోతే, ఇలాంటి సమావేశం ఏర్పాటుచేసేందుకు 42 నెలలు సమయం ఎందుకు పట్టింది?
 8. కుల వృత్తులను ప్రోత్సాహం అంటూ   తెలంగాణ కోసం పోరాటం చేసిన విద్యార్థులు,నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా  గొర్రెలు,బర్రెలు ప్రదానం అనడం వారిని అవమాన పర్చడం కాదా?
 9. క్యాబినెట్ లో ఎస్ సి, ఎస్ టి, మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోయేందుకు కారణం ఏమిటి?
 10.  తెలంగాణ పోరాటంలో త్యాగాలు చేసిన బలహీన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలివ్వడం మీద ఎందుకు ఒక కాలెండర్ ప్రకటించడం లేదు.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page