పిట్టల వ్యాపారంలో తెలంగాణ స్పీకర్ బిజీ

పిట్టల వ్యాపారంలో తెలంగాణ స్పీకర్ బిజీ

ప్రజల్లో కలిసిపోతూ వారి బాగోగులు తెలుసుకుని అండగా నిలబడే రాజకీయ నాయకులు చాలా అరుదు. అలాంటిది అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నతపదవిలో ఉండి కూడా  నియోజకవర్గ ప్రజలతో ముఖ్యంగా గిరిజనులతో మమేకమవుతూ వారి బాగోగులు తెలుసుకోవడంలో సిరికొండ మధుసూధనాచారి ముందుంటారు. ఇదివరకే చిన్న పిల్లలతో గోటీలాట ఆడి, వలవేసి చేపలు పట్టి వినూత్న కార్యక్రమాలతో ప్రజలతో ప్రజలతో మమేకమైన ఆయన తాజాగా పిట్టలను అమ్ముతూ దర్శనమిచ్చారు. ఊరికే సాధారణ నాయకుల మాదిరిగా కాకుండా తనదైన శైలిలో ప్రజలతో కలిసే ఈయనంటే కూడా ప్రజలకు అభిమానమే. అందుకే  ఈ మధ్య ఆయనకు పాలాభిషేకం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన పిట్టల వ్యాపారం ఎందుకు పెట్టాడో తెలుసుకుందాం.

జయశంకర్‌ జిల్లాలోని గణపురం మండలం పిట్టలగూడెం గ్రామంలో జరిగిన ప్రజాదర్బార్‌ లో పాల్గొన్న స్పీకర్ మధుసూదనాచారి అక్కడి ప్రజలతో కలిసిపోయారు. ముఖ్యంగా పిట్టలను పట్టి, వాటిని అమ్ముకుని ఉపాధి పొందే సూకాలంబాడీ కులవృత్తిని అనుసరించారు. అచ్చం వారిలాగే విధుల్లో తిరుగుతూ ''పిట్టలు అమ్ముతాం...పిట్టలో పిట్టలు'' అంటూ పిట్టల బుట్ట చేతబట్టుకుని సందడి చేశారు. దీంతో స్థానికులతో పాటు ఆయన వెంట వున్న నాయకులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత మదుసూధనాచారి మాట్లాడుతూ...  ఎవరి కుల వృత్తి ఎలా వున్నా ప్రతి ఒక్కరి ఇతరుల పనిని గౌరవించాలని అక్కడున్న వారికి స్పీకర్ సూచించారు.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page