మంత్రి కేటీఆర్ కి సోషల్ మీడియాలో జేజేలు

మంత్రి కేటీఆర్ కి సోషల్ మీడియాలో జేజేలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ కి సోషల్ మీడియాలో జేజేలు కొడుతున్నారు. ఓ చిన్నారికి ఆయన చేసిన సాయం చాలా గొప్పదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. మంత్రి కేటీఆర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే.  సోషల్ మీడియా వేదికగా తన ముందుకు వచ్చిన ఎన్నో సమస్యలకు స్పందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేవారు. కాగా.. ఈసారి ఆయన మానవత్వం చాటుకున్నారు. ఓ చిన్నారి కంటి ఆపరేషన్‌కు రెండు గంటల్లో రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి చిన్నారి కంటి చూపు రావడానికి కారణమయ్యారు.

 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ చిన్నారి కంటిచూపు సమస్యతో బాధపడుతోంది. చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కూడా వర్తించడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో భరత్‌ అనే ఓ నెట్‌జన్‌ వారి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. బాధితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని, ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో వర్తించడంలేదంటూ సమస్యను మంత్రి కేటీఆర్‌కు వివరించాడు. చికిత్సకు సిఫారసు చేసి చిన్నారికి అండగా ఉంటాలని ట్విట్టర్‌లో కోరాడు. దీనిపై స్పందించిన మంత్రి తప్పక సహాయమందిస్తామని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వర్గాలతో మా‍ట్లాడి తగిన విధంగా ఆదుకుంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos