బడ్జెట్ మీద తెలంగాణకు ఎన్ని ఆశలో...

First Published 31, Jan 2018, 11:59 AM IST
telangana government all hopes on central budget
Highlights
  • రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ ఏడాది బడ్జెట్ పై చాలానే ఆశలు పెట్టుకుంది.

మరికొద్ది గంటల్లో బడ్జెట్ పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ని ప్రవేశపెట్టున్నారు. ఈ బడ్జెట్ కోసం సామాన్య ప్రజలు ఎతంగా ఎదురచూస్తున్నారో.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ ఏడాది బడ్జెట్ పై చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని.. రూ.35వేల కోట్లు అడిగినట్లు ఈటెల మీడియా ముఖంగా తెలిపారు. మిషన్ భగీరథ పథకానికి రూ.19,405కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10వేల కోట్లు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు ఈ టెల తెలిపారు. కేంద్ర బడ్జెట్ ని అరుణ్ జైట్లీ ఫిబ్రవరిలో ప్రవేశపెడుతుండగా.. రాష్ట్ర బడ్జెట్ ని మార్చి నెలలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. గతేడాది ప్రవేశపెట్టిన రూ.1,49,646 కోట్ల బడ్జెట్ లో కేటాయించిన నిధులన్నీ సక్రమంగా ఖర్చు చేస్తున్నట్లు  చెప్పారు. కేంద్ర బడ్జెట్ విషయంలో ఈటెల మాటలు వింటుంటే.. బడ్జెట్ పైన చాలానే ఆశలు పెట్టుకున్నట్లు కనపడుతోంది. మరి ఈ ఆశలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి.

loader