Asianet News TeluguAsianet News Telugu

పాపం, తెలంగాణ కాంగ్రెస్ కష్టాలు చూడండి

గాంధీభవన్ లో సంబురాల్లేక చాన్నాళ్లయింది. అందుకే పక్కనున్న మహారాష్ట  నాందేడ్  మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ  గెలవడం తెలంగాణ కాంగ్రెస్ కు పండగయింది

Telangana congress finds hope in Nanded municipal corporation election and celebrates part y victory

సింగరేణి ఎన్నికల పరాజయంతో భవిష్యత్తు  గురించి బెంగతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ను  ఉత్తేజ పరిచే వార్త మహారాష్ట నుంచి వచ్చింది. వచ్చిందే తడవుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంబురాల్లో పడిపోయారు. ఆ వార్త ఏమిటో తెలుసా… నాందేడ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ అఖండ విజయం సాధించడం. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవన్  ఏరియా లోని నాందేడ్-వాఘల మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్ డబ్ల్యు ఎం సి) ఎన్నికల్లో 81 డివిజన్లలో 73 స్థానాలను కాంగ్రెస్ గెల్చుకుంది. ఏడారిలో వయాసిస్సులాగా నాందేడ్ ఇపుడు కాంగ్రెస్ వేగు చుక్క అయింది. ఇక్కడ గతంలో కూడా కాంగ్రెసే అధికారంలో ఉండింది. కాకపోతే, ఈ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకుంది. గొప్పసంగతే... ఒక విధంగా. కాని బిజెపి ఏమంటున్నదో తెలుసా... ‘గతంలో మాకున్నవి రెండు సీట్లే.. ఇపుడు పెరిగాయి’ అని.

సాధారణంగా మునిసిపల్ ఎన్నిక ఏమంత పండగ చేసుకోవలసినంత పెద్ద వార్త కాదు. అయితే, కాంగ్రెస్ కు ఎటూచూసినా పరాజయాలే. ఎపుడు మంచి రోజులొస్తాయో తెలియదు. తాజాగా సింగరేణి ఎన్నికల్లో పార్టీకి ఓటమి ఎదురయింది. అలాంటపుడు మునిసిపాలిటి అయితేనేం , ఏదో ఒక చోట గెల్చి కార్యకర్తలను ఉత్తేజ పరిచే వార్త కావాలి. అలాంటపుడు నాందేడ్-వాఘల మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరిగింది.నాందేడ్ తెలంగాణతో  బాగా సంబంధాలున్న నగరం. సిక్కు పుణ్యక్షేత్రం. సిక్కుల గురువు  గుర్ గోబింద్ సింగ్ నివసించిందక్కడే. దీనితో నాందేడ్ కు బాగా గుర్తింపువచ్చింది. నిజామాబాద్ కు 115 కి.మీ దూరంలో  ఉంటుంది.హైదరాబాద్ కు 293 కి.మీ.  ఈ లెక్కన తీసుకున్నా కూడా నాందేడ్ దగ్గిరే కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ స్ఫూర్తిగా తీసుకోవచ్చు.

నాందేడ్ ఎన్నికల్లో  బిజెపి గెల్చింది కేవలం ఆరు డివిజన్లలోనే. ఇక శివసేనకు వచ్చింది ఒక్కసీటే. ఈ ఉత్సాహంలో ఇక బిజెపి తిరుగు ప్రయాణం మొదలయిందని  కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర బిజెపి  ప్రభుత్వ కార్మిక మంత్రి శంబాజీ పాటిల్ నిలంగేకర్ స్వయంగా ఈ ఎన్నికలను పర్యవేక్షించారు అయినా ఫలితం రాలేదు.నాందేడ్ విజయాన్నితెలంగాణకాంగ్రె స్ కూడా కాంగ్రె స్ పార్టీ పునరాగమన సూచనగా తీసుకుంటున్నది. బిజెపి హావా అయిపోయిందని , ఇక కాంగ్రెస్ దూసుకువస్తుందని తెలంగాణ నేతలు ఆశిస్తున్నారు.

అందుకే గాంధీభవన్ లో సంబురాలు చేసుకున్నారు. పార్టీ నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని అభినందించారు. టీపీసీసీ ప్రధానకార్యదర్శి ప్రేమలాల్, మైనారిటీ సెల్ సిటీ అధ్యక్షులు సోహెల్ నేతృత్వం లో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హంగామా సృష్టించారు.కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీకి అనుకూలంగా నినాదాలు చేశారు.చాలా రోజుల తర్వాత విజయోత్సాహం జరుగుతూ ఉండటంతో పెద్దఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



 

Follow Us:
Download App:
  • android
  • ios