Asianet News TeluguAsianet News Telugu

‘జై తెలంగాణా’ అంటున్న తెలంగాణ ప్రవాసీలు (వీడియో)

తెలంగాణ గల్ఫ్ ఎన్ ఆర్ ఐ పాలసీ తెేవాలి అలాకాని పక్షంలో తమ తెలంగాణ బిడ్డలు తమ సత్తా  ఏమిటో నిరూపిస్తారని  హెచ్చరిస్తున్నారు

Telanana Gulf NRIs to launch telangana movement for NRI policy

గల్ఫ్ లో ఉన్న తెలంగాణ ప్రవాసులు టిఆర్ ఎస్ ప్రభుత్వం మీద గుస్సా అవుతన్నారు. ఎపుడో  తెస్తానని హామీ ఇచ్చిన తెలంగాణ ఎన్ ఆర్ ఐ పాలసీ కోసం పోరాడాలని నిర్ణయించారు. పోరాటం సెగ ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రవాసీ మంత్రి కెటిఆర్ దాకా వెళ్లేలా పోరాడదామంటున్నారు. మన కుటుంబాలకు ఎన్ని వోట్లున్నాయో వాళ్లకు తెలిసొచ్చేలా పోరాడాలని నిర్ణయించారు.  మూడున్నరేళ్లయిపోయినా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకురాలేకపోవడం పట్ల వారు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. 15 లక్షల మంది గల్ఫ్ ఉద్యోగులు ఏటా కొన్ని వేల కోట్ల రుపాయలను ఇండియాకు పంపిస్తున్నా, వాళ్ల బాగుకోసం ఏమీ చేయలేకపోయారని వారు ఆందోళన చెందుతున్నారు. గల్ప్ ఎన్ ఆర్ ఐ పాలసీ కోసం తెలంగాణ ఉద్యమంలాగా ‘ఇక్కడి’ నుంచే ఉద్యమం, అది కూడా శాంతియుత ఉద్యమం చేపట్టాలని వారు నిర్ణయించారు. ఉన్నరాష్ట్రంలో ఉపాధి లేక కడుపు చేత్తో పట్టుకుని గల్ఫ్ కు వచ్చిన వారి భద్రత   కోసం  అలసత్వం చూపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు, తొందర్లో ఎన్నికలు రాబోతున్నాయని గుర్తు చేస్తూ తమ కుటుంబాలకు ఎన్నివోట్లు ఉన్నాయో  ప్రభుత్వం గుర్తించాలని గల్ఫ్ ఎన్ ఆర్ ఐ హెచ్చరించారు. ప్రభుత్వం వ్యతిరేకులని తమకు ముద్రపడిన పర్వాలేదని, గల్ఫ్ తెలంగాణ బిడ్డల కోసం పోరాడతామని చెబుతూ ఇది ప్రభుత్వ వ్యతిరేకపోరాటంగా మారకముందే ప్రభుత్వం మేల్కొనాలని వారు విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వం హామీ నెరవేర్చి, తెలంగాణ గల్ఫ్ ఎన్ ఆర్ ఐ పాలసీ తెస్తే, తాము ప్రభుత్వంతో కలసి బంగారు తెలంగాణ కోసం కృషిచేస్తామని, అలాకాని పక్షంలో తమ తెలంగాణ బిడ్డలు తమ సత్తా  ఏమిటో నిరూపిస్తారని వారు హెచ్చరించారు. కింది వీడియో చూడండి.

గల్ఫ్ లో తెలంగాణ పోరాటం (వీడియో)

http://telugu.asianetnews.com/video/telangana-nris-in-gulf-to-wage-fight-for-gulf-nri-policy

Follow Us:
Download App:
  • android
  • ios