Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రోళ్ల జల చౌర్యం : తెలంగాణ గరం గరం

  • కె.ఆర్.ఎం.బి.ఉదాసీనత
  • మరోసారి టాంపర్  జరక్కుండా చూస్తామన్న కె.ఆర్.ఎం.బి
  • ఎటూ తేలని కె.ఆర్.ఎం.బి.సమావేశం.
  • అక్టోబర్ మొదటి వారం టి.ఎస్.,ఏ.పి.లతో బోర్డు చర్చలు
Telanana alleges Andhra drawing water illegally from Potireddypadu

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర జరుగుతున్న జలచౌర్యం పై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు( కెఆర్ ఎంబి) ఉదాసీనత  ప్రదర్శించడం పట్ల తెలంగాణ తీవ్ర నిరసన తెలిపింది. శుక్రవారం నాడిక్కడ జలసౌధ లో జరిగిన కె.ఆర్.ఎం.బి.సమావేశం వాడి, వేడిగా కొనసాగింది. ఫలితంగా ఎటూ తేలకుండానే ఈ సమావేశం ముగిసింది.

పోతిరెడ్డిపాడు వద్ద కె.ఆర్.ఎం.బి. ఏర్పాటు చేసిన టేలిమెట్రీ స్టేషన్ నమోదు చేస్తున్న ప్రవాహ సమాచారాన్ని మొత్తంగా టాంపర్  చేసిన ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేసి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని టి.ఎస్.డిమాండ్ చేసింది. అయితే  కె.ఆర్.ఎం.బి. సుముఖత చూపలేదు.

టేలిమెట్రీ ద్వారా జరుగుతున్న ప్రవాహ లెక్కలను తారు మారు చేసినట్టు సాక్ష్యాధారాలను కె.ఆర్.ఎం.బి.ముందు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రికార్డులను మార్చిన విషయాన్ని 'మెకట్రానిక్స్'సంస్థ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో ఒప్పుకున్నారు.కానీ ఆ సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పై కె.ఆర్.ఎం.బి.స్పందించలేదు. ఆ సంస్థ ను బ్లాక్ లిస్టులో పెట్టాలన్న డిమాండ్ ను కూడా కె.ఆర్.ఎం.బి.పెడచెవిన పెట్టింది.పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణ జలాల చౌర్యం భారీగా జరుగుతున్నదంటూ టి.ఎస్.ప్రభుత్వం పలు మార్లు ఆధారాలతో చేసిన ఫిర్యాదుల కారణంగా నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, పోతిరెడ్డిపాడు వంటి కృష్ణా ప్రాజెక్టుల దగ్గర టేలిమెట్రీ యంత్రాలను కె .ఆర్.ఎం.బి.ఆధ్వర్యంలో అమర్చారు.దీంతో పాటు ప్రవాహ నమోదును ప్రామాణీకరించేందుకు డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఏ.ఇ. లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందాలు ఏర్పాటు అయ్యాయి.సెప్టెంబర్ 20,21 లలో ఈ బృందాలు ప్రాజెక్టుల దగ్గర విస్తృతంగా పర్యటించి ADCP అనే మొబైల్ సాంకేతిక పరిజ్ఞానంతో telemetry పాయింట్ ను ప్రామాణీకరించారు.

సెప్టెంబర్ 21నుంచి పోతిరెడ్డిపాడు నుంచి భారీగా ప్రవాహం వెళ్తున్నా టేలిమెట్రీ పరికరాలు దాన్ని సరిగ్గానే నమోదు చేస్తున్నప్పటికీ మేకట్రానిక్స్ ప్రతినిధులు లెక్కలను తారు మారు చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి ప్రవాహం 12000 క్యూసెక్కులు ఉండగా, టే లిమెట్రీ కూడా దాన్ని ధృవీకరించినా 10,000 క్యూసెక్కులుగా లెక్కలు తారుమారయ్యాయి. జరిగింది.'టెలిమేట్రీ' వ్యవస్థ నమోదు చేస్తున్న రికార్డుల ను పరిగణనలోకి ఇప్పుడే తీసుకోవడం లేదని, ఇది ప్రయోగ దశలోనే ఉందని కె.ఆర్.ఎం.బి.సభ్యులు అన్నారు. దీనిపై టి.ఎస్.తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇకపై ట్యామ్పర్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కె.ఆర్.ఎం.బి.నామమాత్రపు హామీ ఇచ్చింది. టి.ఎస్.ఇరిగేషన్ అధికారులు కె.ఆర్.ఎం.బి.వాదనను తోసిపుచ్చారు. అక్టోబర్ 4 లేదా 5 వ తేదీ లలో మరోసారి ఏ.పి.,తెలంగాణ ఇరిగేషన్ ఈ.ఎన్. సి.లతో సమావేశం నిర్వహిస్తామని కె.ఆర్.ఎం.బి.చైర్మన్ శ్రీ వాస్థవ తెలిపారు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ప్రవాహ వివరాలు టాంపరింగ్ చే శారని తెలంగాణ ఇంజనీర్లు ప్రభుత్వానికి సెప్టెంబర్ 26న సమాచారం అందించినారు. నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ ఎస్.సునీల్ సాక్షాధారాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించినారు. ఈ నివేదికపై  మంత్రి హరీష్ రావు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ .కె.జోషి  , ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లతో జలసౌధలో అత్యవసరంగా సమావేశమై సమీక్షించారు.  టెలీమెట్రి పరికరాలను ఏర్పాటు చేస్తున్న ఏజెన్సీ మెకట్రానిక్స్  మొత్తం సమాచారాన్ని మార్పు చేసి పోతిరెడ్డపాడు ప్రవాహాలను తక్కువ చేసి చూపించడం పట్ల మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. అప్పటికప్పుడు కె.ఆర్.ఎం.బి చైర్మన్ శ్రీ వాస్తవ తో ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వం తరపున నిరసన వ్యక్తం చేసినారు. టాంపర్చేసిన రీడింగ్ నీ తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే ప్రశ్నే లేదని ప్రకటించారు. స్పెషల్ సి.ఎస్.  జోషి , ఈ.ఎన్. సి మురళీధర్  రావు అదే రోజు కె.ఆర్.ఎం.బి చైర్మన్కు నిరసన లేఖను అందజేశారు. ఈ నేపథ్యంలో నే శుక్రవారం కె.ఆర్.ఎం.బి.సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కె.ఆర్.ఎం.బి.చైర్మన్ శ్రీ వాస్తవ,సభ్యుడు సుబ్బయ్య, ట్.ఎస్.ఇరిగేషన్ ఈ.ఎన్. సి.మురళిదర్ రావు,నాగార్జున సాగర్ సి.ఈ.సునీల్, పోతిరెడ్డిపాడు ఎస్.ఈ.రాఘవరెడ్డి, ఈ.ఈ.శ్రీనివాసులురెడ్డి, మెకట్రానిక్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios