Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రా రైతుకు తెలంగాణ మంత్రి అభినందన

రాష్ట్రం విడిపోయినా ఆంధ్ర, తెలంగాణా ప్రజలందరం అన్నదమ్ములుగా కలిసి ఉందాం

telagana minister pocharam all praise for Andhra farmer

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని గోఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంను తెలంగాణ  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  పొచారం శ్రీనివాస రెడ్డి నేడు సందర్శించారు. గో మూత్రంతో  సేంధ్రీయ పద్దతిలో పండ్లు, కూరగాయలను పండిస్తున్న రైతు సాంబిరెడ్డిని మంత్రి పొచారం అభినందించారు.ఇలాంటి పద్ధతుల అవలంభించి ఆంధ్ర తెలంగాణ రైతులు బాగుపడాలని ఆయన ఆకాంక్షించారు.

 

 

ఈ సందర్భంగా పోచారం చేసిన ప్రసంగం విశేషాలు:

వినియోగదారుల ఆహార అభిరుచులలో మార్పు వస్తున్నది.

సహాజమైన పద్దతులలో పండించిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత పెరుగుతుంది.

రైతులు మెల్లిగా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేం ద్రియ ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలి.

రాష్ట్రం విడిపోయినా ఆంధ్ర, తెలంగాణా అన్నదమ్ములుగా కలిసి ఉందాం.

రాష్ట్రాలు విడిపోయినా ప్రజల మద్య ఆత్మీయత పెంచుకోవాలి.

ఆత్మీయతతో కలిసి అభివృద్ధి చెందాలి.

రైతులు ఎక్కడైనా రైతులే.

ప్రభుత్వాలు రైతాంగానికి అన్ని విదాలుగా సహాయ సహకారాలు అందించాలి.

 ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని  తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం వ్యవసాయ రంగంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది.

36 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 17000 కోట్ల రుణాలను మాఫి చేశాం.

 వ్యవసాయానికి  పగలే నాణ్యమైన కరెంటును 9 గంటలు ఇస్తున్నాం. రైతుల నుంచి డిమాండ్ వస్తే వచ్చే యాసంగి నుండి 24 గంటలు ఇస్తాం.

తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి లక్షా యాబై వేల కోట్ల రూపాయలతో కృష్ణ, గోదావరి నదులపై సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం.

అన్నింటికీ మించి దేశంలోనే మొదటిసారిగా ప్రతి ఎకరాకు ముందస్తు పెట్టుబడిగా రూ..4000 వచ్చే ఏడాది ఖరీఫ్ నుండి ఇవ్వబోతున్నాం.

Follow Us:
Download App:
  • android
  • ios