ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ నెల 12వ తేదీన ఆ రాష్ట్ర మాజీ మంత్రి ప్రసాద్ రాయ్ మనమరాలు ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ నవదంపతులు కలిసి దిగిన కొన్ని ఫొటోలు ఇప్పుడు ఇంటర్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.భార్య ఐశ్వర్యను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని.. ఆ సైకిల్‌ను తేజ్ ప్రతాప్ తొక్కుతున్న ఫోటో ఒకటి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. పాట్నా వీధుల్లో సైకిల్ తొక్కుతున్నట్లు తేజ్ ప్రతాప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోను అప్‌లోడ్ చేశారు.  కుర్తా పైజామాలో తేజ్ ప్రతాప్, కాషాయ రంగు చీరలో ఐశ్వర్య రాయ్.. అందర్నీ ఆకట్టుకున్నారు. వివాహ బంధం సంతోషంగా సాగాలంటూ పాట్నా ప్రజలు ఆ జంటను దీవించారు.